Bigg Boss 6 Telugu 9 Week Voting: బిగ్ బాస్ సీసన్ 6 ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది..ఇంటి సభ్యుల సంఖ్య తగ్గేకొద్దీ ,బిగ్ బాస్ టాస్కులను కఠినతరం చేస్తూ ఇంటి సభ్యులు అద్భుతంగా ఆటని ఆడేలా చేస్తున్నారు..అయితే ఇంతకు ముందు సీజన్స్ లో లాగ కాకుండా, ఈసారి సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ పొజిషన్ ర్యాంకింగ్ వారం వారం కి మారిపోతూ వస్తుంది..ప్రతి వారం కంటెస్టెంట్స్ ఆట తీరుని బట్టే వోటింగ్ లో కూడా అనూహ్యమైన మార్పు కనబడుతుంది..గత వారం లో ఇంటి సభ్యులందరు నామినేట్ అవ్వగా..సూర్య కి అతి తక్కువ ఓట్లు రావడంతో అతను ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఈ వారం హౌస్ నుండి బయటకి వెళ్లిపోవడానికి తొమ్మిది మంది నామినేషన్స్ కి వచ్చారు..వాళ్ళు ఎవరెవరు అంటే రేవంత్, ఇనాయ సుల్తానా, రోహిత్, మెరీనా , గీతూ, ఆది రెడ్డి ,బాలాదిత్య , ఫైమా మరియు కీర్తి నామినేట్ అయ్యారు..వీరిలో ప్రస్తుతం వోటింగ్ ప్రకారం టాప్ 3 లో ఎవరు ఉన్నారు..చివరి రెండు స్థానాల్లో ఎవరు కొనసాగుతున్నారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ఇక ఎప్పటిలాగానే ఈ వారం కూడా రేవంత్ అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు..ఆయన ఆటతీరు మరియు వ్యక్తిత్వం చూసే ప్రేక్షకులకు మొదటిరోజు ఎలా అయితే అనిపించిందో..ఇప్పటికి కూడా అదే స్థాయిలో ఉండడం వల్లే అతని స్థానం ఎలాంటి మార్పు లేకుండా అలాగే కొనసాగుతుంది..ఇక ఆయన తర్వాతి స్థానం లో శ్రీహన్ ఉండేవాడు..కానీ ఈ వారం ఆయన నామినేషన్స్ లో లేకపోవడం వల్ల ఆయన స్థానం లో ఇనాయ సుల్తానా కొనసాగుతుంది..ఈ వారం ఇంటి సభ్యులందరు ఆమెని టార్గెట్ చెయ్యడం వల్ల ఆమె ఎంతో కసిగా మగవాళ్ళతో పోటీపడి ఆడింది..అందుకే ఆమెకి రెండవ స్థానం లభించింది..ఇక మూడవ స్థానం లో బాలాదిత్య కొనసాగుతున్నాడు.
గీతూ రాయల్ బాలాదిత్య బలహీనత తో ఆడుకోవడం వల్ల ఆయన పై సానుభూతి ప్రేక్షకులలో బాగా పెరిగిపోయింది..అందుకే ఆయనకీ ఓట్లు కూడా బాగా పడ్డాయి..ఇక బాలాదిత్య తర్వాత నాల్గవ స్థానం లో కొనసాగుతున్న కంటెస్టెంట్ ఆది రెడ్డి..ఈయన ఆట తీరుని బాగా మెరుగుపర్చుకోవడమే కాకుండా ఎలాంటి భేదభావం లేకుండా ప్రవర్తిస్తున్న తీరుకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

ఇక 5 వ స్థానం లో కీర్తి మరియు ఆరవ స్థానం లో శ్రీ సత్య కొనసాగుతున్నారు మరియు ఏడవ స్థానం లో గీతూ రాయల్ ఉన్నారు..గత వారం లో వోటింగ్ లైన్ లో మెరుగైన స్థానాల్లో ఉన్న మెరీనా మరియు రోహిత్ మాత్రం ఈసారి కాస్త వెనుకబడ్డారు అనే చెప్పాలి..వీళ్లిద్దరి మధ్య ఉన్న ఓట్ల తేడా చాలా తక్కువే అని చెప్పాలి..ఇక ప్రతి వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా టాప్ 5 లో కచ్చితంగా కొనసాగే ఫైమా మాత్రం ఈసారి చివరి స్థానం లో కొనసాగుతూ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్ గా నిలిచింది.
ఎంటర్టైన్మెంట్ పరంగా మరియు టాస్కులు ఆడడంపరంగా చిచ్చరపిడుగులాగా దూసుకుపొయ్యే ఫైమా ఈసారి బాగా వెనుకబడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం..ప్రస్తుతానికి అయితే డేంజర్ జోన్ లో మెరీనా మరియు ఫైమా ఉన్నారు..వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చూడాలి.