Jagan vs Ramoji Rao – AP CID : తన ప్రత్యర్థి రామోజీరావుపై ఏపీ సీఎం జగన్ పగ సాధించాడు. పంతం పట్టినట్టే మార్గదర్శి కేసులో భారీ షాక్ ఇచ్చాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మార్గదర్శి కేసులో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తూ ఏకంగా రూ.793 కోట్ల విలువైన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది.
మార్గదర్శి కేసులో .. రూ.793 కోట్ల విలువైన రామోజీ ఆస్తులను అటాచ్ చేసిన సీఐడీ రామోజీరావుకు భారీ షాక్ ఇచ్చింది. మార్గదర్శిలో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్‌మెన్, ఆడిటర్‌లు కుట్రతో నేరానికి పాల్పడినట్లు సీఐడీ తెలిపింది.
మార్గదర్శి చిట్స్ ద్వారా సేకరించిన డబ్బును హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు నిగ్గుతేల్చింది. ఏపీలో 37 బ్రాంచ్‌ల ద్వారా మార్గదర్శి వ్యాపారం చేస్తోందని తేలింది. ఏపీలో మార్గదర్శికి సంబంధించి 1989 చిట్స్ గ్రూప్‌లు.. తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూప్‌లు ఉన్నాయి. ఖాతాదారులకు వెంటనే డబ్బుఇచ్చే స్థితిలో మార్గదర్శి లేదని తేల్చింది.
వడ్డీలిస్తామని చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లను సేకరించింది. అక్రమంగా నిధులు మళ్లించింది. ఇన్ కమ్ ట్యాక్స్ చట్ట ఉల్లంఘనలకు పాల్పడింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి కార్యకలాపాలు, ఖాతాదారుల డబ్బును వివిధ రంగాలకు మార్గదర్శి మళ్లించిందని తేల్చింది. ఈ క్రమంలోనే ఏకంగా 793 కోట్ల రామోజీరావు ఆస్తులను అటాచ్ చేసింది.
రామోజీరావుకు మార్గదర్శినే అసలు సిసలు ఆదాయవనరు. దీనిద్వారానే రామోజీ ఈనాడు, ఈటీవీ, ప్రియా పచ్చళ్లు, రామోజీ ఫిలిం సిటీలాంటి భారీ పరిశ్రమలు స్థాపించారు. మార్గదర్శి డబ్బుద్వారానే లబ్ధిపొందారు. ఇప్పుడు అందులోని అక్రమాలు నిగ్గుతేల్చి ఆ ఆస్తులనే జగన్ అటాచ్ చేయించడం రామోజీరావుకు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు.
గతంలో ఎందరో సీఎంలను రామోజీరావు చూశారు. జగన్ తండ్రి వైఎస్ఆర్ సైతం రామోజీని ఎదురించారు. ఉండవల్లితో మార్గదర్శిపై కేసులు వేయించి పోరాడారు. కానీ కోర్టులకు ఎక్కి రామోజీరావు ఊరట తెచ్చుకున్నారు. అధికారంలో ఉన్నన్నీ నాళ్లు రామోజీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమీ చేయలేకపోయారు. కానీ జగన్ అలా కాదు. రామోజీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఏకంగా 80 ఏళ్ల జీవితంలో రామోజీ ఇంటి గడప తొక్కని పోలీసులు తొక్కించేలా చేశాడు జగన్. ‘ఇది కాలమహిమో జగన్ మహిమో’ అంటూ ఆస్పత్రి బెడ్ పై సీఐడీ విచారణను ఎదుర్కొని రామోజీరావు ఆవేదన చెందారు. అటు చంద్రబాబును ఏడిపించారు. రామోజీని బెదరగొట్టారు. అందుకే ఇప్పుడు వేటగాడు మారాడు.. ఇక రామోజీ, చంద్రబాబులను సాలిడ్ గా వారి ఆయువుపట్టును నరకడమే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.