Homeఎంటర్టైన్మెంట్Anchor Dresses: చిన్న పిల్లల పాటల ప్రోగ్రాంలు.. డ్రెస్ సెన్స్ లేని యాంకర్లు..!

Anchor Dresses: చిన్న పిల్లల పాటల ప్రోగ్రాంలు.. డ్రెస్ సెన్స్ లేని యాంకర్లు..!

Anchor dresses: ప్రస్తుతం ఏ టీవీ చూసినా ‘పాటల పోటీలే’ సాగుతున్నాయి. జీ తెలుగులో ‘సరిగమప షో’ క్లిక్ కావడంతో స్టార్ మా సైతం ముందుకొచ్చి చిన్నపిల్లలతో ‘సూపర్ సింగర్ జూనియర్’ అంటూ మొదలుపెట్టింది. దీనికి జబర్ధస్త్ కమెడియన్ సుధీర్, యాంకర్ అనసూయలను హోస్ట్ గా పెట్టింది. వీరిద్దరూ కామెడీ జనరేట్ చేయడానికి కష్టపడుతున్నారు.

sirmukhi anauya

అనసూయ నిన్న జరిగిన షోలో మాత్రం నిండైన దుస్తులే ధరించింది. న్న పిల్లల పాటల పోటీలు కావడంతో అనసూయ కాస్త పద్ధతిగా నిండైన దుస్తులతోనే ఈ షోలో కనిపించింది ఈసారికి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలా చేసింది. కానీ గతవారం మొదటి ఎపిసోడ్ లో అనసూయ స్లీవ్ లెస్ డ్రెస్ చూసి అందరూ ముక్కునవేలేసుకున్నారు. జబర్ధస్త్ లా ఇక్కడా కనిపించడంతో అవాక్కయ్యారు.

Also Read: Amalapuram Incident: మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగులబెట్టినా ఎందుకు చర్యల్లేవ్.? ఏంటి కథ?

ఇక జీ తెలుగులో మాత్రం యాంకర్ శ్రీముఖి కాస్త హాట్ హాట్ దుస్తులు ధరించి పాటల పోటీల్లో గాయకులు శృతిపై దృష్టి పెట్టకుండా తనపైనే ఉండేలా చూసుకుంటోంది. నిన్న జరిగిన షోలో శ్రీముఖి వేసుకున్న డ్రెస్సు పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరీ ఇంత కురుచ దుస్తులు అదీ పాటల పోటీల్లో పాల్గొనేందుకు అవసరమా? అని కామెంట్ చేస్తున్నారు.

Anchor dresses
anasuya bharadwaj

‘ఎవరో డిజైనర్ గానీ, సిగ్గుపడుతూనే కుట్టినట్టున్నాడు… చివరకు బూతులకు ఎంతో ప్రసిద్ధి పొందిన జబర్దస్త్ షోలో కూడా ఇలాంటి డ్రెస్సులు వేయడం లేదు కదా యాంకరిణులు… శ్రీముఖీ ఏమిటీ ఈ వేషాలు..?!’ అంటూ సోషల్ మీడియాలో ఆమె డ్రెస్సును షేర్ చేస్తూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

షోలు అన్నాక ఎంటర్ టైన్ మెంట్ పంచాలి. అలాగే అందమైన యాంకర్లు తమదైన స్టైల్లో అలరించాలి. కానీ పద్ధతిగా సాగే పాటల పోటీల్లో కూడా ఈ హాట్ డ్రెస్సుల గోల ఏంటో అర్థం కావడం లేదు. చిన్న పిల్లలు, ప్రముఖ సింగర్లు వచ్చే ఈ షోలోనైనా కాస్త పద్ధతిగల బట్టలు వేసుకుంటే మంచిదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Also Read:Amalapuram Incident: మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగులబెట్టినా ఎందుకు చర్యల్లేవ్.? ఏంటి కథ?

Recommended Videos:
ఫ్యాన్స్ లో జోష్ నింపిన బాలకృష్ణ || Akhanda 175 Days Celebrations || Bala Krishna || Chilakaluripet
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ || Bigg Boss 6 Telugu Contestants List || Ok Telugu Entertainment
ఆది సినిమాని వదులుకున్న స్టార్ హీరో || Tollywood Star Hero Rejected Aadi Movie

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version