G-20 తర్వాత శ్రీనగర్ లో మరో పెద్ద సమావేశం

ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనుండగా చంద్రబాబు సహా పలు రాష్ట్రాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చంద్రబాబుతో సమావేశమయ్యే చాన్స్ ఉందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Written By: NARESH, Updated On : June 3, 2023 9:29 pm
Follow us on

G-20 : జీ20 పర్యాటక రంగ సమావేశం శ్రీనగర్ లో జరిగింది. ఇది మనందరికీ తెలుసు. మే 22-14 మధ్య. దాంతోపాటు శ్రీనగర్ కన్వేన్షన్ సెంటర్ గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. జూన్ 29-జులై 31 మధ్య దేశంలోని న్యాయమూర్తులందరూ మూడు రోజుల పాటు సమావేశం పెట్టుకోవాల్సిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు.. మొత్తం 200 మంది న్యాయమూర్తులు సమావేశం కాబోతున్నారు. దీన్ని నల్సార్ నిర్వహిస్తోంది. కేంద్రం న్యాయశాఖ మంత్రి, సొలిసిటర్ జనరల్, సహా దేశంలోని న్యాయకోవిదులందరూ హాజరు అవుతున్నారు. బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయసేవలు ఎలా చేయాలి? ఎలా విస్తరించాలన్నది.. లోక్ అదాలత్ బలోపేతం కోసం ఈ సమావేశం జరుగబోతోంది.

జీ20 శిఖరాగ్ర సమావేశ నిర్వహణ ఈసారి ఇండియాకు దక్కిన సంగతి తెలిసిందే.సన్నాహాక సమావేశాల్లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన నాయకులకు భాగస్థులను చేశారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం దేశ రాజధానిలో జరిగే సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు.

ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనుండగా చంద్రబాబు సహా పలు రాష్ట్రాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చంద్రబాబుతో సమావేశమయ్యే చాన్స్ ఉందని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

G-20 తర్వాత శ్రీనగర్ లో మరో పెద్ద సమావేశంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..