https://oktelugu.com/

Angkor wat : అంగోర్ వాట్.. ఈ హిందూ దేవాలయం కూడా కాలగర్భంలోకి..

ఈ ఆలయంలో వ్లాగ్ చేసిన అన్వేష్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంగోర్ వాట్ ఆలయానికి సంబంధించి అతను చేసిన వ్లాగ్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : February 3, 2024 / 10:28 PM IST
    Follow us on

    Angkor wat : అయోధ్యలో ఏళ్ల సంవత్సరాలుగా పోరాడితే రామాలయం నిర్మాణం సాధ్యమైంది. అక్కడ బాల రాముడు ప్రాణ ప్రతిష్ట చేసుకొని పూజలు అందుకుంటున్నాడు. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని రోజూ దర్శించుకుంటున్నారు. వారణాసి కోర్టు తీర్పు ఇస్తే జ్ఞానవాపీ మసీదులో పూజలు మొదలయ్యాయి. రేపో, మాపో అక్కడి కాశీ విశ్వనాథుడు వెలుగులోకి వస్తాడు. ఒకవేళ కోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే అక్కడ కూడా స్వామివారికి కోవెల ఏర్పాటు అవుతుంది. మనదేశంలో అందులోనూ హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో ఆలయాలను రక్షించుకునేందుకు ఇంత ప్రయాస పడుతుంటే.. ఎక్కడో పొరుగున ఉన్న కంబోడియాలో అది కూడా ప్రపంచ ఎనిమిదవ వింతగా వినతికెక్కిన హిందూ దేవాలయం ఎవరికీ పట్టడం లేదు. పైగా ఇన్ని రోజులు ముస్లింలు, క్రిస్టియన్ ల చేతిలో ధ్వంసమైన ఆలయాలు.. తాజాగా బౌద్ధుల చేతులోనూ ధ్వంసానికి గురవుతున్నాయి. హిందూ దేవతల ప్రతిమలు, చారిత్రాత్మక ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. శాంతానికి మారుపేరుగా ఉండే బౌద్ధులు ఇలా చేయడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

    ఎనిమిదవ వింతగా ప్రసిద్ధి చెందిన అంగోర్ వాట్ ఆలయం ఆనవాళ్ళను కోల్పోతోంది. క్రీస్తుశకం 900 సంవత్సరంలో తమిళ రాజు సూర్య వర్మన్ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. అనంత పద్మనాభ స్వామి ఎలా అయితే ఉంటారో..ఈ అంగోర్ వాట్ ఆలయంలో విష్ణుమూర్తి కూడా అలానే ఉంటారు. కాకపోతే ఈ ఆలయాన్ని బౌద్ధులు ఆక్రమించుకున్న తర్వాత నాటి ఆనవాళ్లను క్రమంగా చేరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆలయ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎక్కడికక్కడ కళావిహీనంగా కనిపిస్తోంది. అంతేకాదు ఆలయంలో బౌద్ధ మతానికి చెందిన దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్టించారు. ఆ దేవుళ్లకు పంది తనను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. హిందూ ఆచారాల ప్రకారం పూజలు జరిపిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ బౌద్ధ సంస్కృతి విలసిల్లే విధంగా మార్పులు చేస్తున్నారు. కంబోడియాలో ఉన్న ఈ ఆలయాన్ని తెలుగు నాట ప్రసిద్ధి చెందిన యూట్యూబర్ “నా అన్వేషణ” అన్వేష్ ఈ ఆలయాన్ని సందర్శించాడు. అక్కడ విశేషాలను పంచుకున్నాడు.

    అతడు చెప్పిన వివరాల ప్రకారం ఆలయం చాలా విస్తారంగా ఉంది. ప్రధాన ద్వారం, ప్రధాన ఆలయం, ఇతర ఉపాలయాలు నాటి సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. నిర్వహణ సరిగా లేకపోవడంతో అరుదైన శిల్పాలు, దేవుళ్ళ ప్రతిమలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. పర్యాటకులు భారీగా వస్తున్నప్పటికీ.. వారి ద్వారా వచ్చే ఆదాయంపై దృష్టి సారించిన కంబోడియా ప్రభుత్వం.. ఆలయ నిర్వహణపై ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. పైగా బౌద్ధ మతానికి ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా విష్ణుమూర్తికి పాన్పు లాగా ఉండే ఆదిశేషు, ఇతర విగ్రహాలు కళా విహీనంగా కనిపిస్తున్నాయి. వందల ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయాన్ని పరిరక్షించాలంటే కోట్లల్లో నిధులు కావాలి. అన్ని నిధులు కంబోడియా వద్ద లేవు. ఒకవేళ ఉన్నా ఆలయాన్ని పరిరక్షించే ఉద్దేశం ఆ దేశానికి లేదు. బౌద్ధులు కూడా క్రమక్రమంగా ఆలయంలో ఆనవాళ్లను మార్చుతున్నారు. ఇలానే ఉంటే అంగోర్ వాట్ ఆలయం కాల గర్భంలో కలిసి పోవడం ఖాయమని పర్యాటకులు వాపోతున్నారు. ఈ ఆలయంలో వ్లాగ్ చేసిన అన్వేష్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంగోర్ వాట్ ఆలయానికి సంబంధించి అతను చేసిన వ్లాగ్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.