Anasuya Jabardhast : అనసూయకు పెళ్లి అయ్యింది. ఇద్దరు చిన్న పిల్లలకు తల్లి కూడా. ఆ చంటి పిల్లలను అమ్మ వద్ద వదిలేసి మరీ జబర్ధస్త్ లో యాంకర్ గా అనసూయ ఆడిపాడింది. జబర్ధస్త్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా మిస్ కాకుండా ఆ షోను నిలబెట్టడంలో తన వంతు పాత్ర పోషించింది. అయితే అన్ని జర్నీలకు ముగింపులాగానే.. అనసూయ కూడా తన చివరి ఎపిసోడ్ ను జబర్ధస్త్ లో ముగించింది.

జబర్ధస్త్ కు గుడ్ బై చెప్పిన అనసూయ.. ఇక సినిమాలు, వెబ్ సిరీస్ లు, పలు గెస్ట్ షోలనే పరిమితమవుతానని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. ఇక అనసూయ నటించిన చివరి జబర్ధస్త్ ఎపిసోడ్ ఈనెల 28న వచ్చే గురువారం ప్రసారం కానుంది. ఆ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. అదిప్పుడు వైరల్ గా మారింది.

జబర్ధస్త్ చివరి ఎపిసోడ్ లో టీం కంటెస్టెంట్లు, జడ్జీలు అంతా ఎమోషనల్ అయ్యారు. అనసూయ ఇక వచ్చేవారం రాదని తెలిసి అందరూ ఆమెను రిక్వెస్ట్ చేశారు. మా కోసం నెలలో 3 రోజులు కూడా కేటాయించలేవా? అని టీం లీడర్ చలాకీ చంటి విన్నవించాడు.
ఇక జడ్జి ఇంద్రజ అయితే కన్నీళ్లు పెట్టుకుంది. మమ్మల్ని ఎందుకు వీడిపోతున్నాం.. కొనసాగవచ్చు కదా అని రిక్వెస్ట్ చేసింది. స్టేజీపైకి వచ్చి అనసూయను గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. ఇక తాగుబోతు రమేశ్ టీం అయితే అనసూయ వెళ్లిపోతోందని.. ఆమె వెళ్లిపోవడానికి కారణం ఏంటన్న దానిపై చేసిన స్కెచ్ అందరినీ కంటతడి పెట్టించింది.
ఇక జడ్జీలు, కంటెస్టెంట్లు అందరూ జబర్ధస్త్ ను ఎందుకు వీడుతున్నావ్? కనీసం నెలలో మూడు రోజులు కేటాయించలేవా? అని వేడుకున్నా అనసూయ మనసు కరగలేదు. ఆమె జబర్ధస్త్ లో కొనసాగలేకపోవడానికి కారణం చెప్పలేదు. వచ్చే వారం ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ అనసూయ జబర్ధస్త్ వీడిపోవడానికి కారణం చెబుతుందా? అసలు ఏమన్నా మాట్లాడిందా? కంటెస్టెంట్ల కోరికను మన్నించి కొనసాగిందా? లేదా? అన్నది తెలియనుంది.
మొత్తానికి అనసూయ చివరి జబర్ధస్త్ ఎపిసోడ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరినీ కంటతడి పెట్టించి ఎమోషనల్ కు గురిచేసింది. అనసూయ కొన్నేళ్లుగా సాగిన జబర్ధస్త్ ప్రస్థానం చివరి ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్ గా సాగింది. ఆ వీడియోను కింద చూడొచ్చు.
