Analysis On World’s Population : “అమెరికా లో డాలర్లు పండుతాయి. ఇండియాలో సంతానం ఉత్పత్తి అవుతుంది. ఏ ఏటికి ఆ ఏడు ఇండియా ఈనుతున్నది.. ” మనదేశంలో జనాభా పెరుగుదలకు సంబంధించి మహాకవి శ్రీశ్రీ చలోక్తిగా రాసిన కవితలు ఇవి.. ఒక ఇండియానే కాదు ప్రపంచం మొత్తం ఇప్పుడు జనాభా విస్ఫోటన కేంద్రంగా మారింది. నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మైలురాయికి చేరుకోబోతోంది. 48 సంవత్సరాల తర్వాత పోలిస్తే ఇది రెట్టింపు. ఐదు దశాబ్దాలలోపే ఇంతటి జనాభా పెరగడానికి కారణాలు అనేకం.
క్రీస్తు పూర్వం 8000 సంవత్సర ప్రాంతంలో ప్రపంచ జనాభా 50 లక్షలుగా ఉండేది. క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి అది 20 కోట్లకు చేరింది. కొన్ని అంచనాలు 30 కోట్లు, 60 కోట్లు అని చెబుతున్నాయి. 1804 సంవత్సరంలో ప్రపంచ జనాభా వంద కోట్లకు చేరుకుంది. పరిశ్రమల ఏర్పాటు తో ఉపాధి అవకాశాలు పెరిగాయి. వైద్యంలో విప్లాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితం ఆకాల మరణాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా ఇవి శిశువుల్లో బాగా తగ్గిపోయాయి. సగటు ఆయుర్దాయం పెరిగింది. ఇది జనాభా పెరుగుదలకు దారి తీసింది. వాస్తవానికి ప్రపంచ జనాభా 200 కోట్లకు చేరడానికి 126 ఏళ్లు పట్టింది. 300 కోట్ల మార్కు కు 30 ఏళ్లు, 400 కోట్లకు 14 ఏళ్లు, 500 కోట్ల మార్కుకు 13 ఏళ్లు పట్టింది. 600 కోట్ల మార్కుకు చాలా వేగంగా 11 ఏళ్ళే పట్టింది. 700 కోట్లకు, 800 కోట్లకు ఇదే సమయం పట్టింది.
ప్రపంచ జనాభాపై ఆసక్తికర విషయాలను ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
