Analysis On Pawan Kalyan Meeting In Mangalagiri : పవన్ కళ్యాణ్ మంగళగిరిలో మాట్లాడిన మాటలు చూస్తే ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే తప్ప అలాంటి మాటలు రావు. 2019 తర్వాత ఏ రోజు కూడా హుందాతనం మరిచి పవన్ మాట్లాడలేదు. కానీ వైసీపీ మంత్రులు,నేతల వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. కుటుంబాలను లాగుతుండడంతో పవన్ తట్టుకోలేకపోయారు. వైసీపీ మంత్రులను చెప్పుకోవడానికి కూడా వాళ్లు అనర్హులు. పవన్ ఆక్రోషంలో అర్థం ఉంది.

వైసీపీ మంత్రులను ముందుపెట్టి జగన్ నడిపిస్తున్న ఆట ఇదీ. జగన్ గ్రీన్ సిగ్నల్ లేకుండా వీళ్లకు పవన్ పై మాట్లాడేంత దమ్ము ధైర్యం లేదు. జగన్ కనుసన్నల్లోనే పవన్ పై ఈ నీచ రాజకీయాలు చేస్తున్నారు.
ఏ ఆధారం లేకుండా ఉత్తరాంధ్ర జనసేన నేతలను జైల్లో పెట్టడమే పవన్ కళ్యాణ్ ను కలిచివేస్తోందని అర్థమవుతోంది. ఆ ఓపిక పవన్ లో నశించడానికి ఇదే కారణం. ప్యాకేజీ స్టార్ అన్న దానికి చెంప పెట్టులా సమాధానమిచ్చాడు. వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు పవన్ మాట్లాడకపోయి ఉంటే బాగుండేది.
పవన్ ఆవేదనలో కారణం ఉంది. కానీ పవన్ ఇప్పుడు ఒక వ్యక్తి కాదు.. శక్తి. ఈ రాష్ట్రానికి దిశానిర్ధేశం చేయబోయేటంతటి వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దబోయే వ్యక్తి. ఎంతో మంది ఆశతో ఎదురుచూస్తున్నవంటి శక్తి. అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎలా ఉండాలన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..