India Today Survey : ఆంధ్రా పై సర్వేలు, సమీకరణాలు

ఆంధ్రా పై ఇండియా టుడే సర్వేలు, సమీకరణాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : February 9, 2024 1:56 pm

India Today Survey : ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ నిన్న రిలీజ్ అయ్యింది. సీఓటర్ తో కలిసి దీన్ని విడుదల చేస్తుంది. ఎందుకనో ఇది సమగ్రంగా లేదనే భావన కలుగుతోంది. ఈ సర్వే ఎన్డీఏకు 335, ఇండియా కూటమికి 166, ఇతరులు 42 సీట్లు సాధిస్తారన్నది దాని సారంశం. కానీ ఇందులో లోపం కనిపిస్తోంది.

అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే.. అసలు సర్వే చేయాల్సినటువంటి సందర్భమే కాదు.. ఇప్పుడు చేయకుండా ఫిబ్రవరి చివరి వారంలో చేసి ఉంటే ఎన్డీఏకు సీట్లు పెరిగి ఉండేవి..

ఎందుకు ఇది సందర్భం కాదంటే.. అయోధ్య రామమందిరం ప్రధాన అంశంగా మారింది. జనవరి 28కే ఈ సర్వే పూర్తయ్యింది. అయితే రామమందిరం వేవ్ ఇందులో రిఫ్లెక్ట్ కాలేదు. ఫిబ్రవరి వరకూ ఓపినియన్ తీసుకొని ఉంటే రామమందిరం ఇంపాక్ట్ వచ్చి ఉండేది.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో పొత్తుల గురించి చర్చలు సాగుతున్నాయి. రెండోది ఇండియా కూటమి నుంచి పొత్తులు విడిపోయి పార్టీలు బయటకు వస్తున్నాయి. సో ఈ సర్వే ఫలితంపై తేడా వచ్చింది ఇందుకే..

ఆంధ్రా పై ఇండియా టుడే సర్వేలు, సమీకరణాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.