Analysis on Great Andhra Telangana Political Survey: తాజాగా తెలుగు ప్రముఖ వెబ్ సైట్ సర్వే ఫలితాలు ప్రకటించింది. దీని ప్రకారం టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి తక్కువ మెజార్టీతోనే వస్తుంది. కాంగ్రెస్ ఇదివరకటితో పోలిస్తే బలం పుంజుకుంటుంది. బీజేపీకి అంత సీన్ లేదని.. క్లుప్లంగా ఆ టాప్ వెబ్ సైట్ ప్రకటించింది. ఎందుకు ఈ సర్వే గురించి చెప్పుకోవాలన్నది ఇక్కడ ప్రస్తావన అంశంగా మారింది.

ఆ వెబ్ సైట్ ఫక్తు ఆంధ్రా రాజకీయాలు, సినిమాలపై రాస్తుంటుంది. పైగా జగన్ పై ఈగవాలకుండా ఫక్తు ఆయనను పొగుడుతూనే రాస్తుంది. అలాంటి వెబ్ సైట్ ఏపీలో సర్వేను కాస్తా పారదర్శకంగానే ప్రకటించింది. కానీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం అంత పారదర్శకంగా లేనట్టు ప్రకటించింది.
తెలంగాణ సర్వేలో అటువంటి వివరాలు ఏవీ లేవు. దీన్ని బట్టి వారకే డౌట్ ఉందా? అన్న చర్చ సాగకమానదు. వీటిని కొన్ని సూచనలుగా మనం తీసుకోవచ్చు. తెలంగాణను ఐదు భాగాలుగా చేసి వేల మంది పల్స్ చేశారు. పలు జిల్లాల్లో ముక్కోణపు పోటీ ఉంటుందని చెప్పారు.
ఓట్ల శాతం 39 శాతం, కాంగ్రెస్ కు 31 శాతం, బీజేపీకి 28శాతం ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ కు, బీజేపీకి 3 శాతం మాత్రమే తేడా. టీఆర్ఎస్ కు కాస్త ఓట్ల శాతం తగ్గుతాయి.ఒకవేళ టీఆర్ఎస్ కు కనీస మెజారిటీ లేక తగ్గిపోతే ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అదే కాంగ్రెస్ కు సుమారు 40 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీకి డబుల్ డిజిట్ రాకపోవడమే గొప్ప అని అంటున్నారు. కాంగ్రెస్ కు బలంగా ఉన్న జిల్లాలు నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వస్తాయని తెలుస్తోంది. ముక్కోణపు పోటీలో ఈ నాలుగు జిల్లాల్లో కాంగ్రెస్ కు సీట్లు బాగా వస్తాయని ఆ సర్వే తేల్చింది.
ఆ వెబ్ సైట్ సర్వే రిపోర్ట్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
