Analysis On CPM meeting With CM KCR : సీపీఎం.. సిద్ధాంత గందరగోళంలో దశ, దిశ లేకుండా దాని పరిస్థితి తయారైంది. నిన్న మూడు రోజుల సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్ లో జరిగాయి. ఆ సందర్భంగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వం మొత్తం కూడా కేసీఆర్ ను కలిశారు. సీపీఎం రాష్ట్ర శాఖ ఈ విషయంపై హాట్ కామెంట్స్ చేసింది. అదిప్పుడు చర్చనీయాంశమైంది.

సీపీఎం లాంటి కమ్యూనిస్టు పార్టీ సభ్యులు మొత్తం కేసీఆర్ ను కలవడం సంచలనమైంది. బీజేపీ శత్రువుగా.. కేసీఆర్ మిత్రుడిగా సీపీఎంకు మారిపోయారు. నిజానికి బీజేపీని వ్యతిరేకిస్తున్నందుకే కేసీఆర్ తో చెలిమికి కమ్యూనిస్టు పార్టీ పాకులాడింది. ఇంతకీ కమ్యూనిస్టుల దృష్టిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజారంజకుడా? ప్రజా కంఠకుడా? అన్నది తేలాలి కదా? ప్రజలను మెప్పించే కార్యక్రమాలు చేస్తున్నాడా? అని సీపీఎంను మీడియా ప్రశ్నించింది.
బీజేపీకి గట్టిగా కేసీఆర్ నిలబడితే ఆయన వెంట నడుస్తామని సీపీఎం నేతలన్నారు. అంటే ప్రజా రంజకుడు అన్నది పక్కనపెట్టి బీజేపీకి వ్యతిరేకుడా కాదా? అన్నదే ఇక్కడ కీలక అంశంగా మారింది. బీజేపీని వ్యతిరేకిస్తేనే కేసీఆర్ తో మిత్రత్వం అన్న సీపీఎం తీరు చూసి మీడియా జర్నలిస్టులు, ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
సీపీఎం సిద్ధాంతం.. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకమా? అనుకూలమా? అని మారడం చూస్తుంటే నిజంగానే ఆ పార్టీ పతనమైపోయిందని అర్థమవుతోంది. ఇంతకంటే దారుణమైన సిద్ధాంత ఏ పార్టీలో ఉండదు.. ఈ క్రమంలోనే సిద్ధాంత గందరగోళంలో ఉన్న సీపీఎం తీరుపై ‘రామ్’ వ్యూ పాయింట్ సునిశిత విశ్లేషణను కింది వీడియో చూడొచ్చు.