Pawan Kalyan Yuvashakti : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోనంబర్ 1 వివాదం రోజురోజుకు రాజుకుంటోంది. కోర్టులు తేల్చాల్సిన ఈ అంశంపై టీవీల్లో చర్చలు సాగుతున్నాయి. పౌరహక్కుల కోసం నినదిస్తున్నారు. రాజ్యాంగాలను పరిరక్షించే కోర్టులే దీనిపై తేల్చాలి. జగన్ సర్కార్ ది రాజ్యాంగ ఉల్లంఘన అన్నది తేలుస్తుంది.
గుంటూరు, కందకూరులో జరిగిన మరణాలను మాత్రం ఎవ్వరూ యాక్సెప్ట్ చేయడం లేదు. టీడీపీ బాధ్యత తీసుకోవాలి. వైసీపీ రక్షణ కల్పించాలి. కందకూరులో అంత జరిగాక కూడా ఆగకుండా కావలిలో చంద్రబాబు మళ్లీ సభ పెట్టి మాట్లాడడం ఒకింత ఆశ్చర్యం కలిగించకమానదు. వాయిదా వేసుకుంటే బాగుండేది. 9 మంది చనిపోతే సానుభూతి తెలిపి వేరే సభ పెట్టుకోవడాన్ని ఎవరూ హర్షించడం లేదు.
గుంటూరులో టికెట్ ఆశించిన ఉయ్యూరు శ్రీనివాస్ రెడ్డి కిట్స్ ఇస్తానని చెప్పి జనాలను రప్పించి చావులకు కారణమయ్యాడు. కానీ చంద్రబాబుకు కాస్తంత అయినా మానవతవాదంతో లేకపోవడం.. టీడీపీని సపోర్టు చేసే మీడియా కూడా ఆ రకంగా లేకపోవడం బాధాకరం అని చెప్పొచ్చు.
దీన్ని సాకుగా చూపించి జగన్ ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పకతప్పదు. రేపు పవన్ కళ్యాణ్ యువశక్తి మీటింగ్ 12న జరుగతోంది. శ్రీకాకుళంలో జరిగే ఈ సభకు జగన్ సర్కార్ జరగనిచ్చే ఛాన్స్ లేదు. ఈ క్రమంలోనే జగన్ చేస్తున్న రాజకీయాలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.