BJP Situation in AP : ఆంధ్రాలో బీజేపీకి దశా దిశా లేదు. బీజేపీ దేశంలో ప్రథమ స్థానం.. ఆంధ్రాలో అథమస్థానంగా ఉంది. దేశం మొత్తం వదిలిపెట్టి దక్షిణాదిన బీజేపీ బలం చూసుకుంటే.. కర్ణాటకలో ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఇక్కడ పోటీపోటీగా ఉంది. తమిళనాడులో బీజేపీకి అవకాశమే లేదు. తమిళ బీజేపీ నేత అన్నామలై బీజేపీని అక్కడ పైకి తీసుకువస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 5శాతం ఓట్లు సంపాదించిపెట్టాడు. కేరళలో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవకపోయినా 15శాతం ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణలో పోయిన సారి 8శాతం వచ్చిన బీజేపీకి ఈసారి అధికారం కోసం పోటీపడుతోంది. ఫాస్ట్ గా పికప్ అవుతోంది.
ఇక మిగిలింది ఆంధ్రా.. ఆంధ్రాలో బీజేపీ ఒంటరిగా పోటీచేస్తే ఎంత శాతం ఓటు బ్యాంకు వస్తుంది..? అంటే అందరూ ఏకగ్రీవంగా చెప్పే మాట.. డిపాజిట్లు అన్ని చోట్ల గల్లంతు అవుతాయని… అస్సలు బీజేపీ పోటీనే ఇవ్వదు. ఒక్కసారి దీనిపై ఏపీ బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఏపీలో ఎందుకు విఫలమైంది? ఎందుకు బీజేపీకి ఈ పరిస్థితి ఎదురైందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.