
Curd: పెరుగు మనకు పోషకాలు ఇచ్చే ఆహార పదార్థాలలో ఒకటి. దీన్ని ఒక రోజు పులియబెట్టి తీసుకుంటే అందులో మంచి బ్యాక్టీరియా చేరడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగును రోజు తినొచ్చు. దీని వల్ల మన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. జీర్ణక్రియకు దోహదపడుతుంది. ఇతర ఆహారాల నుంచి పోషకాలను గ్రహించడానికి శరీరానికి సహాయపడుతుంది. కానీ పెరుగును పడని వేడి పదార్థాలతో తీసుకుంటే నష్టమే. పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది. కొన్ని పదార్థాలు వేడి చేస్తాయి. వాటితో కలిపి తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి.
పెరుగు బరువు తగ్గడానికి సాయపడుతుంది. యోని ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ సవ్యంగా జరగడానికి ప్రేరేపిస్తుంది. దీంతో పెరుగును ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది. మన శరీరానికి బలం పెరగడానికి దోహదపడుతుంది. పెరుగులో ఉండే ఔషధ గుణాలతో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయనడంలో సందేహం లేదు.
పెరుగు చల్లదనం చేస్తుంది. మామిడి వేడి చేస్తుంది. రెండింటికి పరస్పర వ్యతిరేక గుణాలు ఉన్నాయి. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణక్రియలో అసమతుల్యత ఏర్పడి మనం తిన్నవి అరగవు. చర్మ సమస్యలకు దారి తీస్తుంది. రెండు కలిపి తింటే విషాన్ని కలిగిస్తాయి. రెండింటి కాంబినేషన్ వల్ల మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. రెండింటిని కలిపి తీసుకోవడం మంచిది కాదు. పెరుగును మన శారీరక వ్యవస్థను బాగు చేయడానికి పలు రకాలుగా సాయపడుతుంది.

పెరుగుతో ఉల్లిపాయను కలిపి తీసుకోవద్దు. ఈ రెండింటిని కలిపి తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు వస్తాయి. తామర, సోరియాసిస్ వంటి అలర్జీలు కూడా ఏర్పడతాయి. పెరుగు పాల నుంచే వస్తుంది. కానీ పాలను పెరుగుతో పాటు తీసుకున్నా సమస్యలు వస్తాయి. రెండింటిలో ప్రొటీన్లు, కొవ్వు అధికంగా ఉండటంతో అనారోగ్యం కలుగుతుంది. పెరుగుతో పాటు చేపలు తినడం సురక్షితం కాదు. రెండింటిలో ప్రొటీన్లు ఎక్కువ కావడంతో ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. రెండు జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. రెండింటి కాంబినేషన్ తో ఉదర సంబంధిత సమస్యలు రావడం సహజమే. పెరుగు తినేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే మరి.