Kashmir : పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం మధ్యనే బిల్లులను కేంద్రం పాస్ చేయించుకుంటోంది. ప్రతిపక్షాలను చర్చకు రమ్మంటే గొడవ చేస్తూ కాలం వృథా చేస్తుండడంతో బీజేపీ తనకు తానుగానే బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకుంటోంది. ఈ గందరగోళం మధ్యనే పార్లమెంట్ లో నాలుగు కీలక జమ్మూ కశ్మీర్ బిల్లులను కేంద్రం పెట్టడం విశేషం. అందులో ముఖ్యమైనది కశ్మీర్ పండింట్లకు 2 ఎమ్మెల్యే సీట్లు.. 1 ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థులకు కేటాయించారు.
1990 నుంచి ఇప్పటివరకూ మూడు దశాబ్ధాల్లో పారిపోయి వచ్చిన కశ్మీర్ కుటుంబాల లెక్క తేల్చారు. 46517 కుటుంబాలను గుర్తించారు. 158976 మంది కశ్మీర్ పండింట్లు ఉన్నారు. వీరికి అసెంబ్లీలో రెండు సీట్లు రిజర్వ్ చేశారు. అందులో ఒక సీటు పండింట్ల మహిళకు కేటాయించారు.
ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన వారు 41844 కుటుంబాలు భారత్ లో నివసిస్తున్నారు. వీళ్లకు కూడా జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో 1 సీటు కేటాయించారు. మొత్తం 90 సీట్లకు ఈ మూడు కలిపి 93 సీట్లు అసెంబ్లీలో ఉంటాయి.
ఇక కశ్మీర్ లో పరిస్థితులు మారుతున్నాయి. 3 దశాబ్దాల తర్వాత శ్రీనగర్ లో షియాల మొహరం ప్రదర్శన జరిగింది. కశ్మీర్ లో మారుతున్న పరిస్థితులు.. మోడీ ప్రభుత్వ చర్యలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.