MLA Illegal Affair: “ఎమ్మెల్యేలూ… తస్మాత్ జాగ్రత్త. మీడియా యాక్టివ్ గా ఉంది..సోషల్ మీడియా మీ ప్రతి అడుగును వాచ్ చేస్తోంది.. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి.. లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు.. తర్వాత జరగబోయే పర్యవసనాలు కూడా తీవ్రంగా ఉంటాయి”ఇవి ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన హితోపదేశం. కానీ ఇవేవీ కొత్తగా గెలిచిన ఆ ఎమ్మెల్యే చెవికి ఎక్కలేదు.. పైగా ఆయనకు స్పెషల్ గా క్లాస్ పీకినా బుర్రకు ఎక్కలేదు.. తన ధోరణిలో తాను వెళుతున్నాడు.. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే నేనింతే మారను అంతే రవితేజ లెవల్లో డైలాగులు చెబుతున్నాడు.. ఇతడి వ్యవహారం మొత్తం చూస్తున్న కొంతమంది అధికార పార్టీ నాయకులు వీడికి ఇదేం పోయేకాలం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

అది నల్లగొండ జిల్లాలో ఓ నియోజకవర్గం.. వ్యాపారానికి ప్రధాన కేంద్రం.. తెలంగాణ ప్రాంతంలో రైస్ హబ్ గా ఈ ప్రాంతానికి పేరు ఉంది. అయితే గతంలో ఓ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి… 2018లో భారత రాష్ట్ర సమితిలో చేరిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు.. ఆ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. చాలామంది అతడిని నెత్తిన పెట్టుకున్నారు.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందమో లేక గర్వమో తెలియదు కానీ అతడి నెత్తికి కళ్ళు ఎక్కాయి. అందర్నీ చిన్నచూపు చూడటం ప్రారంభించాడు.. పరిశ్రమలు ఉన్న నియోజకవర్గం కావడంతో దందాలు షురూ చేశాడు.. భూములు ఆక్రమించాడు.. తనకు నచ్చిన వారిని అధికారులుగా నియమించుకున్నాడు.. అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. ఒకప్పుడు స్కూటర్ కూడా దిక్కులేని అతడు ఇవ్వాలా రేంజ్ రోవర్ లో తిరిగే స్థాయికి ఎదిగిపోయాడు. అంతేకాదు హైదరాబాద్ నగర శివారులో భారీ ఎత్తున బహుళ అంతస్తులు నిర్మించాడు.. తాజాగా ఓ ఫార్మా కంపెనీలో కొంతమేర పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.
ఇంతవరకు ఆ ఎమ్మెల్యే ఒక యాంగిల్ మాత్రమే చూసాం.. అతనిలో రసిక రాజా అనే యాంగిల్ కూడా ఉంది.. ఏకంగా ముగ్గురితో అఫైర్ నడుపుతున్నాడు.. సరే ఇది అతడి ఇంటర్నల్ విషయం అనుకోవచ్చు.. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది.. ఫామ్ హౌస్ కేసు తర్వాత ఎమ్మెల్యేలపై నిఘా మరింత పెంచాలని ఇంటెలిజెన్స్ పోలీసులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.. దీంతో ఈ ఎమ్మెల్యే పై ఇంటలిజెన్స్ ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తూ వస్తోంది.. అయితే ఈ ఎమ్మెల్యే రాత్రిపూట ఒంటరిగా కారులోకి వెళ్లడం… తెల్లవారుజామున ఇంటికి రావడం వంటివి జరుగుతున్నాయి… దీనిని ఇంటలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి చేరవేశారు.. ఈ విషయం తెలుసుకున్న సదరు ఎమ్మెల్యే ఇంటలిజెన్స్ అధికారులపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.. ముఖ్యంగా ఓ సీఐపై తోక తొక్కిన తాచులాగా లేచాడు. అటు ప్రభుత్వమేమో ఎమ్మెల్యేల ప్రతి అడుగు తనకు తెలియాలి అంటుంది.. ఇక్కడ ఈ ఎమ్మెల్యే నేమో అది నా ప్రైవేట్ వ్యవహారం నీకెందుకు అంటాడు? ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా పరిస్థితి ఉండడంతో సదరు సీఐ అక్కడి నుంచి మహారాష్ట్ర బార్డర్ లో ఉన్న జిల్లాకు బదిలీ చేయించుకున్నాడు.

కాగా ఆ ముగ్గురు మహిళలు ఒకరికొకరు వరుసకు సోదరిమణులవుతారు. ఆ అక్కాచెల్లెళ్లను తెగ వాడేసుకుంటూ ఎమ్మెల్యే సుఖ పురుషుడిగా రాజ్యమేలుతున్నాడు.
సదరు ఎమ్మెల్యేకు సంబంధించిన రసిక వ్యవహారంపై ఆ నియోజకవర్గంలోని వాట్సాప్ గ్రూపులో రకరకాలుగా చర్చ జరుగుతోంది.. అన్నట్టు ఈసారి ఆ ఎమ్మెల్యేకి టికెట్ దక్కకపోవచ్చని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.