Amit Shah దేశంలోనే పవర్ ఫుల్ వ్యక్తి. మోడీ కంటే కూడా రాజకీయ, పరిపాలన వ్యూహాల్లో డేంజర్ అయిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నోటి వెంట ‘కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది’ అని అన్నాడంmunugodeటే నమ్మాల్సిందే. మునుగోడులో బీజేపీ సభకు హాజరైన అమిత్ షా.. కేసీఆర్ సర్కార్ ను కూల్చేస్తానని ప్రకటించడం రాజకీయంగా సంచలనమైంది.

కాంగ్రెస్ లో ఉన్న రాజగోపాల్ రెడ్డిని లాగి మరీ రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రెడీ అయ్యింది బీజేపీ. దీనివెనుక మాస్టర్ ప్లాన్ నే ఉంది. 2023 ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలిస్తే వారిదే వచ్చేసారి అధికారం.. అందుకే కేసీఆర్ తన సహజ శైలికి భిన్నంగా ముందే మేల్కొని వచ్చి మునుగోడులో వాలిపోయారు. సభ పెట్టారు. అనంతరం అధికార పార్టీగా ఉండి మరీ కమ్యూనిస్టులతో జతకట్టారు.ఇదంతా మునుగోడులో ఓడిపోకూడదన్న ఉద్దేశంతోనే.
మునుగోడులో టీఆర్ఎస్ ఓడితే తెలంగాణ ప్రజల్లో ఒక్కటే ప్రొజెక్ట్ అవుతుంది. అదే టీఆర్ఎస్ ఓటమి వచ్చే ఎన్నికల్లో ఖాయం అని.. బీజేపీ గెలుపు పక్కా అని.. అందుకే కేంద్రం నుంచి అమిత్ షా మునుగోడుకు వచ్చింది. ఇక కేసీఆర్ ఎన్నడూ లేని ఇంత వేగంగా స్పందించారు.
మునుగోడు సభలో కేసీఆర్ సర్కార్ ను కూల్చేస్తానన్న అమిత్ షా ప్రకటన నేపథ్యంలో టీఆర్ఎస్ లోని అసంతృప్తులు, ఎమ్మెల్యేలను బీజేపీ టార్గెట్ చేయబోతోందని అర్థమవుతోంది. ఇప్పటికే కేసీఆర్ నుంచి గెంటివేయబడి బీజేపీలో చేరి గెలిచిన ఈటల రాజేందర్ కు బీజేపీలో చేరికల బాధ్యతలు అప్పగించారు. ఆయనతో కనీసం 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల ముందర వారంతా బీజేపీలో చేరవచ్చని.. కేసీఆర్ సర్కార్ కుప్పకూలడం ఖాయమని బీజేపీ స్కెచ్ గీస్తోంది.
అయితే ఇలాంటి రాజకీయ ఆటల్లో కేసీఆర్ ఎంతో ముందే ఉంటారు. అమిత్ షా తన సర్కార్ ను కూల్చేవరకూ చూస్తూ ఊరుకోరు. మహారాష్ట్రలో శివసేన సర్కార్ ను కూల్చినట్టు తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ను కూల్చడం అంత ఈజీ కాదు. ఆవలించకముందే పేగులు లెక్కబెట్టే టైపు కేసీఆర్. అవసరమైతే బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలనే లాగేసి ఆ పార్టీని దెబ్బతీసే టైపు. కాబట్టి అమిత్ షా అన్నంత మాత్రాన రాజకీయాల్లో చాణక్యుడి లాంటి కేసీఆర్ ను కొట్టడం అంత ఈజీ కాదు. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి బాగా పెరిగితే.. ఏక్ నాథ్ షిండే లాగా టీఆర్ఎస్ లో ఏ హరీష్ రావునో.. లేక మరే ఎమ్మెల్యేనో అసమ్మతి రాజేసి గ్రూపులు కడితే తప్ప అమిత్ షా ఆశలు నెరవేరవు. ఇప్పటికైతే బీజేపీ , టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అనేలా తెలంగాణలో ఫైటింగ్ సాగడం ఖాయం. మునుగోడు గెలుపే ఈ రెండు పార్టీల భవిష్యత్ ను తేటతెల్లం చేస్తుంది.