Telangana Congress : రెండో లిస్టులోనూ రెడ్లకు సింహ భాగం, బీసీలకు మొండి చేయి చూపిన కాంగ్రెస్

రెండో లిస్టులోనూ రెడ్లకు సింహ భాగం, బీసీలకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ తీరు.. తెలంగాణ ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 28, 2023 5:27 pm

Telangana Congress : తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మెల్లిమెల్లిగా స్పష్టత వస్తోంది. మూడు ముఖచిత్రాలు ప్రస్తుతానికి మనకు కనపడుతున్నాయి. ఒకటి అధికార దర్పంతో కూడినిది. రెండో అధికారం కోసం తహతహలాడుతున్న అగ్రవర్ణ ముఖచిత్రం.. మూడోది రాజ్యాధికారం కోసం నినదిస్తున్న సామాజిక తెలంగాణ ముఖ చిత్రం.. వచ్చే నెల రోజులు కూడా ఇదే పద్ధతిలో రాజకీయ ముఖ చిత్రం ఉండబోతోంది.

ఇక అన్నింట్లో ప్రధానమైనది.. బీజేపీ ఈసారి సామాజిక తెలంగాణ అన్న నినాదాన్ని ఎంచుకుంది. మొదటి లిస్ట్ లోనే అది ప్రతిబింబించింది. 52 మంది తొలి మంది బీజేపీ తొలి లిస్ట్ లో 19మంది బీసీలు, 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చారు. ఈ వ్యూహం ఆరోజే అర్థమైంది. ఈ వ్యూహంలో పది అడుగులు ముందుకేసి.. అమిత్ షా ఏకంగా తాము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన నినాదం.. ఇప్పటిదాకా ఉన్న ఎలక్షన్ పద్ధతిని ఇది మార్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ వ్యూహం ఇలా ఉంటేనే ఎన్నికలను మార్చగలదు.. గెలుపు దిశగా నడిపించగలదు..

రెండో లిస్టులోనూ రెడ్లకు సింహ భాగం, బీసీలకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ తీరు.. తెలంగాణ ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.