America vs China : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం ఏదంటే ఏమాత్రం ఆలోచించకుండా చెప్పొచ్చు అమెరికా అని. కానీ మారుతున్న పరిణమాలతో చైనా ఆ స్థానాన్ని ఆక్రమించబోతుందా..? అమెరికాతో పోటీ పడుతున్న చైనా ప్రపంచ పెద్దన్నగా మారిపోతుందా..? ఒకవేళ ఆ స్థాయికి వస్తే ఎలాంటి మార్పలు వస్తాయి..? చైనా ఈ స్థితికి రావడానికి కారణాలేంటి..? మిగతా దేశాలతో పోలిస్తే చైనా ఎక్కవ ఉత్పత్తి ఎలా చేయగలుగుతుంది..? అనే చర్చలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ప్రపంచ వాణిజ్య జాబితాలో చైనా టాప్ ప్లేసులోకి వెళ్లింది. అత్యాధునిక టెక్నాలజీ, బహుళజాతి కంపెనీల మధ్య ఉన్న సంబంధాలు చైనా స్థితిగతిని మార్చేశాయి. ఇదంతా చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చేరడంతోనే జరిగిందని కొందరు అంటున్నారు.

విస్తీర్ణంతో పాటు, రాజకీయంగా ఎంతో కీలకమైన చైనా దేశాన్ని అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ప్రపంచ ఆర్థిక అసమతుల్యానికి మూలం ఇది. కానీ చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో)లోకి చైనా ప్రవేశం చేయడంతో అమెరికా సహా యూరప్ దేశాలను చైనా అధిగమిస్తోంది. పారిశ్రామికంగా మంచి వనరులున్న దేశాలపై చైనా ఇప్పుడు పై చేయి సాధించడం విశేషం. కటిక పేదరికం ఉన్న దేశంలో దానిని రూపు మాపేందుకు కంకణం కట్టుకుంది. అంతకుముందు దేశంలో 50 కోట్ల మంది పేదలుండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక చైనా ఆర్థిక రంగం విలువ 12 రేట్లు పెరిగింది. విదేశీ మారక నిల్వలు 16 రేట్లు పెరిగి 2.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
అయితే చైనా ఇలా ఆర్థికంగా విజయాన్ని సాధించడానికి అనేక కారణాలున్నాయి. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఆర్థిక స్వేచ్చను దేశంలో అమలు చేసింది. రాజకీయ స్వేచ్ఛా మార్గాన్ని అనుసరించిందని అప్పట్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అన్నారు. చైనాను ‘రాజకీయ నియంత్రణ, ఇన్నోవేటివ్ సొసైటీని కలిగి ఉండడం ద్వారా అభివృద్ధి సాధించలేదు’ అని పాశ్చాత్య దేశాలు అన్నాయి. కానీ వాటి అభిప్రాయాన్ని తప్పని నిరూపించింది.
2000 సంవత్సరం వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా దేశం అత్యంత తక్కువ ధరకు ప్లాస్లిక్ వస్తువులను విక్రయించేది. దీంతో పెద్దగా మార్పు ఉండదని ఆర్థక బలమున్న దేశాలు భావించాయి. కానీ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టాప్ ప్లేసులోకి చైనా వెళుతుండడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఎగుమతులు చేసే దేశంలో చైనాది 7వ స్థానం. కానీ త్వరలోనే అది మొదటిస్థానానికి చేరుకోనుందని అంటున్నారు.2000 సంవత్సరంలో చైనా వృద్ధి రేటు 8 శాతం ఉండగా ప్రస్తుతం 14 శాతానికి ఎగబాకింది. 2020 సంవత్సంలో 15శాతం నమోదైంది.
ప్రపంచ వాణిజ్యానికి కంటైనర్ షిప్పులు చాలా కీలకంగా భావిస్తారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా చేరిన తరువాత చైనాలోకి కంటైనర్లు వచ్చిపోయే సంఖ్య పెరిగింది. వీటి సంఖ్య 4 కోట్ల నుంచి 8 కోట్లకు పెరిగింది. 2011 లెక్కల ప్రకారం వీటి సంఖ్య 13 కోట్లకు మారింది. 2020 నాటికి 24.5 కోట్లు పెరిగింది. అయితే చైనాకు సగం ఖాళీగా వెళ్తున్న కంటైనర్లు తిరిగి ఫుల్ లోడుతో వస్తున్నాయి. ఇక చైనా రహదారులను విపరీతంగా విస్తరించింది. 1997లో 4700 కిలోమీటర్లు ఉండగా.. 2020 నాటికి 1,61,000 కిలోమీటర్లకు పెరిగింది. ప్రపంచంలోనే ఇది పెద్ద హైవే నెట్ వర్క్. 2005లో చైనా మొదటిసారి ఉక్కును ఎగుమతి చేసింది. ఆ తరువాత క్రమంగా అత్యధిక స్టీల్ ఎగుమతిదారుగా అవతరించింది. 1990 లో చైనా ఏడాదికి 10 కోట్ల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయగా.. అది 2020 నాటికి 100 కోట్ల టన్నులకు పెరిగింది.
Also Read: Tornado: అమెరికాపై విరుచుకుపడిన టర్నోడోలు.. బీభత్సం..!