Telangana Secretariat: ప్రత్యర్థుల ఊహకు అందకుండా ఎత్తులు వేయడంలో కేసీఆర్ ది అందేవేసిన చేయి. ఆయన చర్యలు ఊహాకు అందకుండా ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి ప్లాన్ వేస్తారన్నది మూడో కంటికి తెలియదు. తెలిశాక అందరూ షాక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రాజకీయాల్లో అపర చాణక్యుడిలాంటి కేసీఆర్ ‘దళిత ఓటుబ్యాంకు’ను చాలా జాగ్రత్తగా వాడడంలో సిద్ధహస్తులు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు అధికారంలోకి వస్తే కాపలా కుక్కలా ఉంటానని.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ నాడు వీరావేషంతో స్టేట్ మెంట్ ఇచ్చాడు. దళితులు నమ్మి ఓట్లు వేశారు. కానీ సీఎం కుర్చీలో కేసీఆర్ కూర్చొన్నారు. బోటా బోటీ మెజార్టీ వచ్చిందని.. అస్థిర తెలంగాణ కాకుండా తాను కాపలా కాస్తానని సర్దిచెప్పి సీఎం సీటు ఎక్కారు.
కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అన్యాయం అంటూ గొంతెత్తుతున్నారు. దళితబంధు అమలు చేసినా కూడా వారిలో సంతృప్తి లేదు. కేసీఆర్ కు ఆ వర్గాలు దూరమయ్యాయి. కేబినెట్ లో ఎస్సీ మాదిగకు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేదన్న అప్రప్రదను కేసీఆర్ మూటగట్టుకున్నారు. ఇలాంటి సమయంలో అదును చూసి ‘దళిత’ అస్త్రాన్ని బయటకు తీశారు.
తెలంగాణ అసెంబ్లీలో ఇటీవల మోడీ సర్కార్ నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనం ‘సెంట్రల్ విస్టా’కు అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేశారు. దీంతో మోడీ సర్కార్ ను, బీజేపీ నేతలను కేసీఆర్ టార్గెట్ చేశారు. ఇప్పుడు తాజాగా తన సర్కార్ నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి ‘అంబేద్కర్’ పేరు బీజేపీ నేతలకు.. అందరికీ కేసీఆర్ షాకిచ్చాడు.

కేసీఆర్ ఒకే దెబ్బకు రెండు పిట్లలు రాలినట్టు అయ్యింది. ఒకటి తెలంగాణలో దళితుల్లో మంచి పేరు తెచ్చుకొని వారి ఓటు బ్యాంకు సంపాదించడం.. రెండోది.. సెంట్రల్ విస్టాకు అంబేద్కర్ పేరుపెట్టని బీజేపీని టార్గెట్ చేయడం.. వారికి దళిత ఓట్లు దూరం చేయడం.. ఇలా కేసీఆర్ ‘అంబేద్కర్’ ఎత్తుగడకు బీజేపీ చిత్తైపోయిందని అంటున్నారు.
ఇప్పుడు కొత్తపార్లమెంట్ కు బీజేపీ ప్రభుత్వం ‘అంబేద్కర్’ పేరు పెట్టకుంటే కేసీఆర్ దాన్ని రాజకీయంగా వాడుకుంటాడు.దళితులను బీజేపీకి దూరం చేస్తాడు. మోడీ సర్కార్ ‘అంబేద్కర్’ పేరు పెట్టే అవకాశాలు అయితే కనిపించడం లేదు. మొదటి నుంచి బీసీలు, అగ్రవర్ణ పేదలకు ప్రాధాన్యం ఇచ్చే మోడీ సర్కార్ ఈ పనిచేయబోదు. సో కేసీఆర్ కు మరో అస్త్రం దొరికినట్టే. ఇలా తెలంగాణలో దూసుకొస్తున్న బీజేపీని ఇరుకునపెట్టడానికి కేసీఆర్ కు అందివచ్చిన ఆయుధంగా ఈ ‘అంబేద్కర్ పేరు’ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.