Sita Ramam OTT: కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఇరగబడి ఆడుతాయి..కానీ టీవీ మరియు OTT లో ప్రసరమైనప్పుడు మాత్రం థియేటర్స్ లో వచ్చినంత రెస్పాన్స్ రాదు..ఎందుకు అలా జరుగుతుంది అని విషయం ఇప్పటికి అర్థం కానీ ప్రశ్న..ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయిన సినిమా సీతారామం..థియేటర్స్ లో ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆగష్టు 5 వ తారీఖున విడుదలైన ఈ సినిమా ఇప్పటికి థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూనే ఉంది..కేవలం రెండు కోట్ల రూపాయిల ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయలకు పైగానే షేర్ ని వసూలు చేసింది..ఇటీవల కాలం లో ఈ స్థాయి లాంగ్ రన్ వచ్చిన సినిమా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇక్కడి స్టార్ హీరోలకు సైతం ఇలాంటి రన్ రాలేదు..థియేటర్స్ లో అంతటి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా ఇటీవలే OTT లో విడుదలైంది.

అమెజాన్ ప్రైమ్ లో ఈమధ్యనే స్ట్రీమ్ అయినా ఈ సినిమాకి నెటిజెన్స్ నుండి ఆశించిన స్థాయి రెస్పాన్స్ అయితే రావడం లేదు..’ఏముంది ఈ సినిమాలో..జనాలు అలా ఇరగబడి చూసి అంత పెద్ద హిట్ ని చేసారు’ అంటూ పోస్టింగ్స్ పెడుతున్నారు..జనాల టేస్ట్ ఎలా ఉంటుందో ఈమధ్య అర్థం కావడం లేదంటూ తెగ ప్రచారం చేస్తున్నారు..కానీ ఈ సినిమాని అభిమానించే వారు మాత్రం కొన్ని సినిమాలు థియేటర్స్ లో చూస్తేనే ఫీల్ వస్తుందని..సీతారామం సినిమా కూడా అలాంటిదే అని చెప్పుకొచ్చారు.

సీతారామం సినిమా టాలీవుడ్ ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీస్ లో ఒకటని..జనాలు వెర్రివాళ్ళు కాదు ఏ సినిమాని పడితే ఆ సినిమాని ఆదరించడానికి..విషయం ఉంది కాబట్టే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు..తెలుగు మరియు మలయాళం బాషలలో సూపర్ హిట్ గా నిలిచినా ఈ సినిమాని ఇటీవలే హిందీ లో దబ్ చేసి విడుదల చేసారు..అక్కడ కూడా రెస్పాన్స్ అదిరిపోయింది..అక్కడ ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్లకంటే 10 వ రోజు వసూళ్లు ఎక్కువ ఉన్నాయట..మరి ఈ సినిమా అక్కడ కార్తికేయ 2 రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో చూడాలి