Ambati vs Trivikram : గుణపాఠం చెబుతాం… త్రివిక్రమ్ కి ఏపీ మంత్రి వార్నింగ్!

నేను ఇప్పటికీ గాజు గ్లాసులో టీ తాగుతానని చెప్పుకొచ్చారు. ఆ పాత్ర చేసిన పృథ్వి మాత్రం అంబటి రాంబాబుకు కౌంటర్లు వేశారు. అసలు మంత్రి అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు. ఆయన ఎవరో కూడా తెలియనప్పుడు నేను ఇమిటేట్ ఎలా చేస్తాను.

Written By: NARESH, Updated On : August 1, 2023 8:07 pm
Follow us on

Ambati vs Trivikram : బ్రో మూవీలో శ్యామ్ బాబు పాత్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. పబ్ సన్నివేశంలో థర్టీ ఇయర్స్ పృథ్వి మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ నాన్ సింక్ లో డాన్స్ ఏంటని కోప్పడతాడు. ఈ సీన్ రిఫరెన్స్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అది అంబటి రాంబాబు దృష్టికి వెళ్ళింది. దాంతో బ్రో చిత్ర యూనిట్ కి, అంబటి రాంబాబుకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. సాయి ధరమ్ తేజ్ ని ప్రమోషన్స్ లో ఇదే విషయం అడిగితే, అంబటి రాంబాబు ఉదంతం నాకు అంతగా తెలియదు. అయితే గాజు గ్లాసు సినిమాలో వాడితే తప్పేంటి అన్నారు.

నేను ఇప్పటికీ గాజు గ్లాసులో టీ తాగుతానని చెప్పుకొచ్చారు. ఆ పాత్ర చేసిన పృథ్వి మాత్రం అంబటి రాంబాబుకు కౌంటర్లు వేశారు. అసలు మంత్రి అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు. ఆయన ఎవరో కూడా తెలియనప్పుడు నేను ఇమిటేట్ ఎలా చేస్తాను. అయినా అంబటి రాంబాబు ఆస్కార్ నటుడేమీ కాదు నేను అనుకరించడానికి అన్నారు. మూవీలో ఒక పనికిమాలిన వ్యక్తి పాత్ర ఉంది చేయమన్నారు, చేశానని కామెంట్స్ చేశారు.

వివాదం అయితే కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ని ఎద్దేవా చేస్తూ అంబటి రాంబాబు ట్వీట్స్ కూడా వేశారు. తాజాగా ఆయన చిత్ర పరిశ్రమను హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్యామ్ బాబు అని ఎందుకు నేరుగా రాంబాబు అనే పెట్టుకోండి. అందులో తప్పేముంది. డాన్స్ సింక్ కాలేదట. నేనేమైన డాన్సర్ నా లేక నా అన్నయ్య డాన్సులో ప్రావీణ్యుడా. మీకు ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తే ఆడవు. కావాలంటే టోటల్ పొలిటికల్ సెటైరికల్ సినిమాలు తీసుకోండి. ఇలా ఎవరిని పడితే వాళ్ళను గెలకడం సబబు కాదు.

ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నటులకు, దర్శకులకు, నిర్మాతలకు, త్రివిక్రమ్ లాంటి రచయితలకు నేను చెప్పేది ఒకటే. ఇలాంటి చర్యలకు మరలా పాల్పడితే గుణపాఠం నేర్పించాల్సి ఉంటుంది. దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మొత్తం చిత్ర పరిశ్రమను హెచ్చరిస్తూ అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంబటి రాంబాబు శైలి చర్చకు దారితీసింది.