
Pushpa 2 – The Rule: స్టైలిష్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన పుష్ప సినిమా కి సీక్వెల్ గా ‘పుష్ప : ది రూల్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ సుమారుగా ఏడాదిన్నర సమయం తీసుకొని తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. మొదటి భాగం ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ లో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించడం తో మూవీ టీం మొత్తానికి ఒత్తిడి బాగా పెరిగిపోయింది.
దానికి తగ్గట్టుగానే సినిమా అంచనాలకు మించి ఉండేలా డైరెక్టర్ సుకుమార్ ఎంతో శ్రద్ద పెట్టి ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు, ఫ్యాన్స్ అందరూ సంబరాల్లో మునిగిపోయారు, ఇలాంటి సమయం లో వాళ్ళ సంబరాలను రెట్టింపు చేసే విధంగా ‘పుష్ప: ది రూల్’ టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ ఎలా ఉందొ, అభిమానుల అంచనాలను అందుకునే విధంగా ఉందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

మూడు నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్ లో పుష్ప మూవీ స్టోరీ మొత్తాన్ని చెప్పేసాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప సిండికేట్ కి ఓనర్ అయినా తర్వాత అతనిని పోలీసులు మాయం చేశారనే ఉద్దంతం తో ఈ టీజర్ సుకుమార్ మార్క్ అడుగడుగునా కనిపించేలా చేసింది. అక్రమంగా సంపాదించిన డబ్బులు మొత్తం పుష్ప మంచి పనులకు వాడుతున్నట్టు గా చూపించాడు.
టీజర్ మొత్తం చూస్తూ ఉంటే అప్పుడే అయిపోయిందా ఇంకా కాసేపు ఉంటే బాగుండును అనిపిస్తుంది. ఇక చివర్లో పుష్ప అడవుల్లో పులి పక్కనే స్టైల్ గా నడుచుకుంటూ పోవడం టీజర్ కి మెయిన్ హైలైట్ గా నిల్చింది.ఇక చివర్లో అల్లు అర్జున్ తన మార్కు యాటిట్యూడ్ తో పుష్ప గాడి రూల్ అంటూ చెప్పిన డైలాగ్ కూడా అదుర్స్. మీరు కూడా ఈ టీజర్ పై ఒక లుక్ వేసేయండి.