https://youtu.be/kPWVAiqZYOg
AGENT Trailer : మాస్ హీరో ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు అక్కినేని అఖిల్. అందుకే డెబ్యూ మూవీ డైరెక్టర్ గా వివి వినాయక్ ని ఎంచుకున్నారు. యాక్షన్ ఫాంటసీ జోనర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘అఖిల్’ నిరాశపరిచింది. దాంతో పంథా మార్చి వరుసగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ చేశారు. అయినా సక్సెస్ దక్కలేదు. బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ కి మొదటి హిట్ ఇచ్చారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ హీరోగా అఖిల్ కి మొదటి హిట్ ఇచ్చింది.
ఈసారి అఖిల్ స్పై థ్రిల్లర్ ఎంచుకున్నారు. సురేందర్ దర్శకత్వంలో ఏజెంట్ మూవీ చేశారు. ఏప్రిల్ 28న ఏజెంట్ వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వైల్డ్ అండ్ రూత్ లెస్ ఏజెంట్ గా అఖిల్ నయా అవతార్ గూస్ బంప్స్ తెప్పించింది.
భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. లొకేషన్స్, విజువల్స్ ట్రైలర్ లో హైలెట్. దుమ్మురేపే యాక్షన్, ఉత్కంఠ రేపే సాహసాల సమాహారమే ఏజెంట్ మూవీ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. రా ఏజెన్సీ అధికారికంగా మమ్ముట్టి రోల్ కీలకంగా ఉంది. ఆయన కూడా యాక్షన్ ఇరగదీశాడు. ట్రైలర్ లో హీరోయిన్ కి పెద్దగా స్పేస్ ఇవ్వలేదు. మూవీలో కూడా రొమాన్స్ పాళ్ళు తక్కువగా ఉండే సూచనలు కలవు.
మొత్తంగా అఖిల్ వన్ మాన్ షోలా ఏజెంట్ చిత్రం ఉండనుంది. హాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ నుండి దర్శకుడు సురేందర్ రెడ్డి స్ఫూర్తి పొందినట్లు అర్థం అవుతుంది . ఏజెంట్ ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఓ భారీ కమర్షియల్ హిట్ కోసం తపస్సు చేస్తున్న అఖిల్ దాహం తీర్చేలా ఉంది. ఇక ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. అనిల్ సుంకర సమర్పణలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. వక్కంతం వంశీ స్టోరీ అందించారు. హిప్ హాఫ్ తమిజా సంగీతం అందించారు. సాక్షి వైద్య హీరోయిన్.