
Viroopaksha : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన పాన్ ఇండియన్ చిత్రం ‘విరూపాక్ష’ ఈ నెల 21 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.కచ్చితంగా విన్నూతనమైన పద్దతి లో డైరెక్టర్ కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అనే విషయం అర్థం అవుతుంది.
సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత తీసిన మొట్టమొదటి చిత్రం ఇదే.వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్ గా నటించింది.నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యింది.ఇకపోతే ఈ సినిమాలో అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న టాక్.
ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రం గ్లిమ్స్ వీడియో కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఈ గ్లిమ్స్ వీడియో బాగా రీచ్ అయ్యింది.ఇప్పుడు సినిమాలో కూడా ఆయన వాయిస్ ఓవర్ ఉండబోతుందట.సినిమాలోని ఉన్న గ్రామం కథ ఎన్టీఆర్ వాయిస్ తో ప్రారంభం అవుతుందట.ఇది ప్రస్తుతానికి సస్పెన్స్ లోనే ఉంచింది మూవీ టీం, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా సాయి ధరమ్ తేజ్ ఈ విషయం పై ఎలాంటి కామెంట్ చెయ్యలేదు.
మరి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఈ సినిమాకి ఓపెనింగ్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు పైగానే జరిగింది.రీసెంట్ గా విడుదలైన సాయి ధరమ్ తేజ్ సినిమాలలో ఇదే హైయెస్ట్.మరి వసూళ్లు ఆ రేంజ్ లో వస్తాయో లేదో చూద్దాం.