Homeజాతీయ వార్తలుAir-strike on Maoist : దండకారణ్య ఆదివాసులపై వైమానిక దాడులు... ఎవరికోసం? ఎందుకోసం?

Air-strike on Maoist : దండకారణ్య ఆదివాసులపై వైమానిక దాడులు… ఎవరికోసం? ఎందుకోసం?

Air-strike’ on Maoist : దండకారణ్యంపై ఇటీవల జరిగిన వైమానిక దాడులు ఎవరికోసమనే అంశం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. శత్రుదేశాలపై ప్రయోగించాల్పిన వైమానిక యుధ్దతంత్రాన్ని… దండకారణ్యంలో ఉండే అల్పజీవులు, గిరిజనులపై అమలు చేయడం పట్ల మానవతావాదులు,మేధావులు,హక్కుల సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. లక్ష ల కోట్ల విలువైన గనులను,అటవీ సంపదను కార్పోరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే దండకారణ్యంపై కేంద్రం వైమానిక దాడులకు పాల్పడుతోందని వీరు భావిస్తున్నారు.అందుకే పిచ్చుకపై బ్రహ్మాస్ర్తంలాగా అమాయక గిరిజనులపై యుధ్దవిమానాలు,సైనిక హెలీకాప్టర్లతో కేంద్రం బాంబు దాడులు చేస్తోందంటున్నారు.

అడవినే నమ్ముకొని జీవించే అమాయక గిరిజనులను తరిమేసి,లక్ష్హల కోట్ల విలువ చేసే అపారమైన ఖనిజ సంపదను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే… ఎన్నడూ లేనివిధంగా ఏ ప్రభుత్వమూ సాహసించని రీతిలో కేంద్రరాష్ర్ట ప్రభుత్వాలు దండకారణ్యంపై మూకుమ్మడిగా దాడులకు తెగబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివాసీల పక్షాన పోరాడే 32మంది బుద్ధిజీవులు బుధవారం హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసారు. దండకారణ్యంలోని ఆదివాసులపై భారత ప్రభుత్వం చేస్తున్న వైమానిక దాడులు రాజ్యంగ విరుధ్దమని,దాడులను వెంటనే ఆపాలని పౌరహక్కుల సంఘాల నేతలు బుధవారం హైదరాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసారు.ఆదివాసీ హక్కుల కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న తాము జనవరి 11న దక్షిణ బస్తర్ లోని కిష్టారం-పామేడు ప్రాంతంలో జరిగిన సైనిక దాడికి దిగ్భ్రాంతి చెందుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేసారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లలో కోబ్రా దళాలు, సిఆర్పిఎఫ్ బలగాలు వెళ్లి బాంబులు దాడులు చేశాయని, ఈ దాడిలో పొట్టం హంగి అనే ఆదివాసీ యువతి మృతి చెందిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని జీవించే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వమే ఈ దేశ ప్రజలపై వైమానిక యుద్ధం చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి , మానవతకు వ్యతిరేకమని అన్నారు. భారత ప్రజలు అనేక ప్రక్రియల ద్వారా, పోరాటాల ద్వారా స్థాపించిన ప్రజాస్వామిక, మానవీయ విలువలను ప్రభుత్వాలే కాలరాస్తున్నాయనడానికి ఈ ఘటన ఉదాహరణ అని అన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నదని ఈ ఘటన తెలియజేస్తోందని, సామాజిక ఆర్ధిక సాంస్కృతిక సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు వాటిని మరింత పెంచుతూ పోయి చివరికి ఇలాంటి యుద్ధ నిర్ణయం తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.

Air-strike’ on Maoist :

మానవ ఆవాసాల మీద దాడులు చేయకూడదని, ప్రజలను లక్ష్యం చేసుకొని ఏ సైనిక చర్యా చేపట్టకూడదని అంతర్జాతీయ యుద్ధ నియమాలు కూడా చెబుతున్నాయని, పొరుగు దేశాల మీద యుద్ధాల్లో సహితం పాటించాల్సిన నియమాలను భారత ప్రభుత్వం తన ప్రజల దగ్గరే పాటించడం లేదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధానికి వ్యతిరేకంగా శాంతిని, మానవ హక్కులను కోరుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ఇలా ప్రజలపై యుద్ధాన్ని ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా దండకారణ్య ప్రాంతంలో ఇలాంటి సైనిక దాడులు జరుగుతున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, ముఖ్యంగా 2021లో, 2022లో మానవ రహిత డ్రోన్ల ద్వారా చాలా ప్రాంతాల్లో బాంబులు వేశారని అన్నరు. మధ్య భారత ఆదివాసీ ప్రాంతంలోని వందలాది ఖనిజాల మైనింగులను ఆదివాసులు వ్యతిరేకిస్తున్నందు వల్లనే ప్రభుత్వం ఈ యుద్ధానికి దిగిందని తాము భావిస్తున్నామని వక్తలు పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గనుల తవ్వకాలకు అనేక ఒప్పందాలు చేసుకున్నాయని, పెసా చట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లోకి గ్రామ సభల తీర్మానం లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టడానికి వీలులేకున్నా,రాజ్యాంగంలోని 5 షెడ్యూల్ ఆదివాసులకు ప్రత్యేక రక్షణను హామీ పడింది. కానీ పాలకులు వీటన్నిటినీ పక్కన పెట్టి ఆదివాసీ ప్రాంతాల్లో గనుల తవ్వకానికి కార్పొరేట్లకు అనుమతి ఇస్తున్నారు. గనుల తవ్వకాలను వీలుగా భారీ రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నారు. ఆదివాసుల నిరసనలను ఎదుర్కోడానికి వందలాది సైనిక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. సిఆర్పిఎఫ్, కోబ్రాలు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు, బిఎస్ఎఫ్ఎకు చెందిన లక్షలాది బలగాలకు స్థావరాలు నిర్మిస్తున్నారని ఈ సమావేశంలో అన్నారు.

చత్తీస్గడ్-తెలంగాణ సరిహద్దుల్లో కూడా 20 దాకా ఇలాంటి క్యాంపులు ఉన్నాయని, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో ఇలాంటి సైనిక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల తెలంగాణ డీజీపీ ప్రకటించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా పని చేస్తానని, ఫెడరల్ వ్యవస్థను కాపాడతానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆదివాసుల విషయంలో కేంద్ర విధానాలనే అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి నమూనా వల్లనే ఈ అణచివేత కొనసాగుతున్నదని, దాని పర్యవసానమే ఆదివాసీ ప్రాంతాల సైనికీకరణ అని అన్నారు. ఈ అభివృద్ధి నమూనా మీద కొన్ని దశాబ్దాలుగా దేశంలో విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రజలకు మేలు చేయదని,సామాజిక రాజకీయార్ధిక నిపుణులు చెబుతూ వచ్చారని వక్తలు అభిప్రాయపడ్డారు. అయినా పాలకులు తమ పద్ధతులను కొనసాగిస్తున్నారని ,అందులో భాగమే దేశ ప్రజలందరికీ వర్తించే సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని విమర్శించారు. దీన్ని అంగీకరించని ఆదివాసులను అణిచి వేయడానికి, వాళ్లను అడవి నుంచి ఖాళీ చేయించడానికి, నిర్మూలించడానికి వైమానిక దాడులకు పాల్పడుతున్నదని అన్నారు.

ఇది ఈ దేశ ప్రజలపై జరుగుతున్న కార్పొరేట్ యుద్ధమని, ఇది సైనికీకరణగా వైమానిక దాడుల రూపంలో ఉధృతమైందని ఆందోళన వ్యక్తంచేసారు. ఈ వైమానిక దాడులు భారత రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని, సమాజంలో మానవీయ విలువలు, ప్రజాస్వామిక ప్రక్రియ…ఇది ప్రజలకు మేలు చేయదని,సామాజిక రాజకీయార్ధిక నిపుణులు చెబుతూ వచ్చారని వక్తలు అభిప్రాయపడ్డారు. అయినా పాలకులు తమ పద్ధతులను కొనసాగిస్తున్నారని ,అందులో భాగమే దేశ ప్రజలందరికీ వర్తించే సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని విమర్శించారు. దీన్ని అంగీకరించని ఆదివాసులను అణిచి వేయడానికి, వాళ్లను అడవి నుంచి ఖాళీ చేయించడానికి, నిర్మూలించడానికి వైమానిక దాడులకు పాల్పడుతున్నదని అన్నారు. ఇది ఈ దేశ ప్రజలపై జరుగుతున్న కార్పొరేట్ యుద్ధమని, ఇది సైనికీకరణగా వైమానిక దాడుల రూపంలో ఉధృతమైందని ఆందోళన వ్యక్తంచేసారు. ఈ వైమానిక దాడులు భారత రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని, సమాజంలో మానవీయ విలువలు, ప్రజాస్వామిక ప్రక్రియలు కొనసాగాలని కోరుకొనే తాము ఈ చర్యలను నిరసిస్తున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపై వైమానిక దాడులతో సహా అన్ని రకాల నిర్బంధాలను ఆపేయాలని వక్తలు డిమాండ్ చేసారు . ఈ ధోరణి ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని, గతంలో ఇలాంటి ప్రభుత్వ చర్యలను పౌర సమాజం తీవ్రంగా నిరసించిందని,పాలకులపై ఒత్తిడి తెచ్చిందని , ఆ పని గతంకంటే మరింత ఉ మ్మడిగా చేపట్టాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కృషి చేయడంలో రాజకీయపార్టీలతో సహా అందరూ పాల్గొనాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రొ. హరగోపాల్,ప్రొ. కె లక్ష్మీనారయణ,ప్రొ. సూరేపల్లి సుజాత,ప్రొ.మాడబూషి శ్రీదర్,సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి,దిశ ఎడిటర్ దూడం మార్కండేయ,విరసం నేత పాణితో పాటు మొత్తం 32మంది వివిధ సంఘాల నేతలు విజ్ఞప్తి భారత ప్రభుత్వానికి విజ్హప్తి చేసారు.

-శ్రీరాముల కొమురయ్య

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular