Annamalai : అన్నాడీఎంకే అన్నామలై తో తెగతెంపులు ఊహించిందే

ఇప్పుడు అన్నాడీఎంకేకు బలమున్న చోట అన్నామలై పాదయాత్ర సాగుతోంది. ఇదే అన్నాడీఎంకే నేతలు కుతకుతలాడడానికి కారణం. అన్నాడీఎంకే ఈరోజు ఒక్క డీఎంకేనే విమర్శించడం లేదు. మొత్తం ద్రవిడ వాదాన్నే విమర్శిస్తున్నారు.

Written By: NARESH, Updated On : September 19, 2023 5:39 pm

Annamalai : అనుకున్నదే జరిగింది. అన్నామలైకు దూరంగా అన్నాడీఎంకే జరిగింది. కారణాలు వెతుక్కొని అన్నాడీఎంకే బయటకు వెళ్లింది. అది ఇవ్వాలా ప్రూవ్ అయ్యింది. అన్నాడీఎంకే కీలక నేత జయకుమార్ ఈ మేరకు అన్నామలైని విమర్శించి బీజేపీకి దూరంగా జరుగుతున్నట్టు ప్రకటించారు. ‘మాకు బీజేపీతో పొత్తు లేదు’ అంటూ అన్నాడీఎంకే ప్రకటించింది.

అన్నాడీఎంకే అన్నాదురైని విమర్శించారని.. జయలలితను తూలనాడాడని అన్నాడీఎంకే గుర్రుగా ఉంది. మీ విదిలించే సీట్లు ఇస్తే తీసుకునే పరిస్థితి బీజేపీకి ఉండాలని ఇన్నాళ్లు అన్నాడీఎంకే అనుకున్నది. కానీ అంతకు మించిన ప్రదర్శనతో అన్నామలై బీజేపీని తమిళనాట ప్రజలకు చేరువ చేస్తున్నాడు. అన్నామలై పాదయాత్రకు ఆకట్టుకుంటున్నాడు. అనూహ్య స్పందనలు వస్తున్నాయి.

ఇప్పుడు అన్నాడీఎంకేకు బలమున్న చోట అన్నామలై పాదయాత్ర సాగుతోంది. ఇదే అన్నాడీఎంకే నేతలు కుతకుతలాడడానికి కారణం. అన్నాడీఎంకే ఈరోజు ఒక్క డీఎంకేనే విమర్శించడం లేదు. మొత్తం ద్రవిడ వాదాన్నే విమర్శిస్తున్నారు.

అన్నామలై తో అన్నాడీఎంకే తెగతెంపులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.