https://oktelugu.com/

Bigg Boss Telugu 7: ప్రశాంత్ తో రతిక రోమాంటిక్ వీడియో లీక్.. బిగ్ బాస్ వీక్షకులకు బిగ్ షాక్

నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పానా అని ప్రశాంత్ రతిక ను ప్రశ్నించగా.. చూస్తున్న అందరికీ తెలుసులే అని ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చింది…

Written By:
  • Vadde
  • , Updated On : September 19, 2023 / 01:51 PM IST
    Follow us on

    Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్.. రతిక రోజ్, బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచి ఏదో ఒక రకంగా హౌస్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ ఇద్దరి పేర్లు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట్లో వీళ్లిద్దరి మధ్య జరుగుతున్న పులిహోర చూసి బిగ్ బాస్ హౌస్ లో మరొక లవ్ స్టోరీ స్టార్ట్ అయింది అని ప్రజలు భ్రమపడ్డారు. అయితే మధ్యలో ఈ నామ్ కే వాస్తే ప్రేమ వ్యవహారంలో రీసెంట్ గా ప్రిన్స్ యావర్ కూడా ఎంటర్ అయ్యాడు.

    రీసెంట్ గా ఒక ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ శివాజీ ముందే యావర్.. రతిక పై తన మనసులో మాట వివరంగా చెప్పాడు. అంతే కాదు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అంటూ ఆమెను నేరుగా అడిగేసాడు.. అయితే రతిక మాత్రం ఎంతో తెలివిగా…ఎప్పటిలా ఏమీ క్లారిటీ ఇవ్వకుండా.. మౌనంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ ,రతిక మాట్లాడుకుంటున్న వీడియో బిగ్ బాస్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

    బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రశాంత్ రతికను తన లేడీ లక్ అని అన్నాడు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మొదలైన సంభాషణ క్రమంగా కంటెస్టెంట్స్ కూడా కాస్త కలవరింత పెట్టేలా తయారైంది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చిన వోడాఫోన్ యాడ్ లాగా.. వేరెవర్ యు గో మై నెట్వర్క్ ఫాలోస్ అన్నట్లు.. రతిక ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ పల్లవి ప్రశాంత్ వెళ్తూ .. వెనకనే తిరిగేవాడు. మొన్న జరిగిన నామినేషన్ సమయంలో కూడా అసలు నువ్వు ఇంట్లోకి వచ్చిన పర్పస్ ఏమిటి అంటూ ఇంటి సభ్యులు అందరూ ప్రశాంత్ ను టార్గెట్ చేశారు.

    ఈ నేపథ్యంలో నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పానా అని ప్రశాంత్ రతిక ను ప్రశ్నించగా.. చూస్తున్న అందరికీ తెలుసులే అని ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చింది…అంతేకాదు ఎక్కడికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావ్ అంటూ నామినేషన్స్ సందర్భంగా రతికి అతన్ని గట్టిగా అడిగింది. అప్పటినుంచి ఇద్దరి మధ్య సరిగ్గా మాటలు లేకపోయినప్పటికీ రీసెంట్గా ఫ్రెండ్స్ అంటూ మళ్ళీ చేతులు కలుపుకున్నారు.

    అందరూ పడుకున్న తర్వాత,రతిక అద్దానికి ఆ వైపు.. పల్లవి ప్రశాంత్ అద్దానికి ఈ వైపు.. మాటలు ,నవ్వులు ..అబ్బో.. చూస్తూ ఉంటే ఏదో సినిమాలో నిబ్బా …నిబ్బి లవ్ సీన్స్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయినా ఇంత జరిగినా ఇద్దరూ ఏమీ జరగనట్టు…నవ్వుకుంటూ .. జోక్స్ వేసుకుంటూ ఉంటే ఇది కదా స్ట్రాటజీ.. అని బిగ్ బాస్ కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే.. ఏమన్నా రతిక పాప పర్ఫామెన్స్ మాత్రం ఎప్పుడు డిసప్పాయింట్ చేయకుండా వేరే లెవెల్ లో ఉంటుంది.

    Tags