https://oktelugu.com/

Actress Meena: వెంకటేష్ ని ముద్దులతో భయపెట్టిన మీనా… ఆ సినిమా షూటింగ్ లో అలా జరిగిందా?

రవిరాజా పినిశెట్టి చిన్న తంబీ చిత్రాన్ని తెలుగులో చంటి గా రీమేక్ చేశారు. మీనా అల్లారుముద్దుగా పెరిగిన జమీందారు ఇంటి ఆడపిల్ల పాత్ర చేసింది. బంగారు పంజరంలో చిలుక లాంటి జీవితం.

Written By:
  • S Reddy
  • , Updated On : February 11, 2024 / 12:14 PM IST
    Follow us on

    Actress Meena: ఓ టెలివిజన్ షోకి జడ్జిగా వచ్చిన నటి మీనా ఆసక్తికర విషయం వెల్లడించాడు. చంటి మూవీ షూటింగ్ లో జరిగిన ఓ సంఘటన ఆమె గుర్తు చేసుకున్నారు.మీనా వెళ్లి వెంకటేష్ ని పట్టుకుని ముద్దులు పెడుతుంటే వెంకటేష్ భయపడిపోయారట. 1992లో విడుదలైన చంటి బ్లాక్ బస్టర్ కొట్టింది. వెంకటేష్-మీనా జంటగా నటించారు. చంటి తమిళ సూపర్ హిట్ చిన్న తంబీ చిత్రానికి అధికారిక రీమేక్. ఒరిజినల్ లో ప్రభు హీరోగా నటించారు.

    రవిరాజా పినిశెట్టి చిన్న తంబీ చిత్రాన్ని తెలుగులో చంటి గా రీమేక్ చేశారు. మీనా అల్లారుముద్దుగా పెరిగిన జమీందారు ఇంటి ఆడపిల్ల పాత్ర చేసింది. బంగారు పంజరంలో చిలుక లాంటి జీవితం. పరాయి పురుషుడు ఆమెను చూడకూడదని అన్నయ్యలు ఆంక్షలు పెడతారు. అలాంటి ఒక అమ్మాయికి పరిచమైన ఒకే ఒక కుర్రాడు చంటి. అతడు అమాయకుడు, వెర్రిబాగులోడు కావడంతో మీనా అన్నయ్యలు అతన్ని మాత్రం ఏమీ అనరు.

    ఐశ్వర్యం తప్ప ఆనందం అంటే ఏమిటో తెలియని మీనాకు చంటి అమాయకత్వం, స్వచ్ఛత నచ్చుతాయి. యువరాణిలా పెరిగిన మీనా అనూహ్యంగా పేదింటి అమాయకుడు చంటి ప్రేమలో పడుతుంది. ఈ పాయింట్ జనాలకు తెగ నచ్చేసింది. మీనా అన్నయ్యగా నాజర్ క్రూయల్ రోల్ చేశారు. లవ్, కామెడీ, ఎమోషన్ జోడించి పల్లెటూరి నేపథ్యంలో చంటి తెరకెక్కించారు.

    చంటి చిత్రానికి ఇళయరాజా అందించిన సాంగ్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రతి సాంగ్ ఒక ఆణిముత్యం. ఏళ్ల తరబడి చంటి సినిమా సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని అలరించాయి. కాగా ఈ చిత్ర విశేషాలు హీరోయిన్ మీనా పంచుకున్నారు. జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న సూపర్ జోడి షోకి మీనా జడ్జిగా వచ్చారు. అమ్మాయి గారు సీరియల్ హీరో-హీరోయిన్… చంటి చిత్రంలోని ఓ సాంగ్ కి పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

    వారి పెర్ఫార్మన్స్ కి మీనా ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా ఆమె చంటి షూటింగ్ లో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తు చేసుకున్నారు. సన్నివేశంలో భాగంగా… చంటీ అంటూ పరుగున మీనా వెళ్లి వెంకటేష్ ని హత్తుకుని ముద్దులు పెట్టిందట. వెంకటేష్ నిజంగా భయపడిపోయారట. ఈ విషయం చెప్పి మీనా గట్టిగా నవ్వేసింది. అలాగే చంటి మూవీ తనకు స్టార్డం తెచ్చిందని ఆమె వెల్లడించారు. చంటి మూవీ గురించి మీనా చెప్పిన విశేషాలు పూర్తిగా తెలియాలంటే నేడు ప్రసారం కానున్న సూపర్ జోడి ఎపిసోడ్ చూడాలి…