ఎంటర్టైన్మెంట్Acharya : 'ఆచార్య' ఫస్ట్ షో అక్కడే.. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా...

Acharya : ‘ఆచార్య’ ఫస్ట్ షో అక్కడే.. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా షాకింగ్ కలెక్షన్స్ !

Acharya: మెగా అభిమానులంతా ‘ఆచార్య’ సినిమా చూడటం కోసం గత మూడేళ్ళ నుంచి పడిగాపులు కాస్తున్నారు. మరి ఈ సినిమా ప్రీమియర్ షోస్ ఎప్పుడు పడబోతున్నాయి ? ముందుగా ఏ దేశంలో షోలు స్టార్ట్ అవ్వనున్నాయి ? లాంటి విషయాలు తెలుసుకుందాం. అమెరికాలోని డల్లాస్‌ లో ‘సినిమార్క్ 17 వెబ్ ఛాపెల్‌ థియేటర్‌’లో ముందుగా ప్రీమియర్ షో పడనుంది.

Acharya
Chiranjeevi

ఇప్పటికే, ఈ థియేటర్ లో ‘ఆచార్య’ టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం 3 గంటలకు ఈ సినిమా ప్రీమియర్ షో పడుతుంది. ‘ఆచార్య’ చిత్రాన్ని XD, RPX, EMAX, DLF, Ultra, ఇంకా మరికొన్ని స్కీన్లలో ప్రదర్శించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.

Also Read: RRR Box Office Collection: RRR: 4 వారాల్లో ఎన్ని వందల కోట్లు వచ్చాయంటే ?

డల్లాస్‌లో సోమవారం నుంచే ‘ఆచార్య’ అడ్వాన్సు బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. తొలుత 10 లొకేషన్లలో 28 షోల కోసం టికెట్ల అమ్మకాలు ప్రారంభిస్తే.. మెగా ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. టికెట్లు కోసం ప్రేక్షకులు ఎగబడ్డారు. దాంతో టికెట్ రేట్లను కూడా అనూహ్యంగా పెంచేశారు.

Acharya
Ram Charan, Chiranjeevi

డల్లాస్‌ లో ప్రస్తుతం ‘ఆచార్య’ టికెట్ రేటు 21 డాలర్లుగా ఉంది. ఇప్పటివరకు అమ్ముడు పోయిన టికెట్లను బట్టి.. మొత్తం ఆచార్యకి 10,740 డాలర్లు కలెక్షన్లు నమోదయ్యాయి. ఎలాగూ బుధవారం నుంచి అన్ని ప్రాంతాల్లో టికెట్ల అమ్మకాలు మొదలు కానున్నాయి. మొత్తమ్మీద అమెరికాలో కూడా ఆచార్య హడావిడి బాగానే కనిపిస్తోంది.

ఈ సినిమాలో చిరు – చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించినప్పుడు ఇద్దరి మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోతుందట. అందుకే, పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై భారీ బజ్ ఉంది. అలాగే, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

పైగా ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. అన్నట్టు ఈ చిత్రం ర‌న్ టైం 2 గంట‌ల 58 నిమిషాలు. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

Also Read: Chiranjeevi Old Movie: KGF మూవీ చిరంజీవి పాత సినిమాకి రీమేక్?? బయటపడ్డ షాకింగ్ నిజాలు

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
Exit mobile version