Godhra Teaser Review: ఇప్పుడు దేశంలో వివాదాస్పద చిత్రల హవా నడుస్తోంది. కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి వాటిని మర్చిపోకముందే నిఖిల్ సిద్ధార్థ హీరోగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టర్ మరణం పై “స్పై, దీ ఇండియా హౌస్” అనే సినిమాలు రూపొందుతున్నాయి.. వీటిని మర్చిపోకముందే గుజరాత్ రాష్ట్రంలో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించి గోద్రా అనే పేరుతో ఒక సినిమా నిర్మితమవుతోంది. దీనికి సంబంధించి యూట్యూబ్లో టీజర్ విడుదలైంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఒకప్పుడు కూడా..
ఇప్పుడు మాత్రమే కాదు ఒకప్పుడు కూడా ఇలాంటి వివాదాస్పద చిత్రాలు తెరమీద సందడి చేశాయి. కానీ అవి అంతగా విజయవంతం కాలేదు. కానీ ఈ మధ్య వస్తున్న సినిమాలు వివాదాలకు కారణమవుతున్నాయి. అదే సమయంలో విజయవంతమవుతున్నాయి. నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి. అయితే వివాదాస్పద కథను నేపథ్యంగా ఎంచుకోవడంతో కావలసిన పబ్లిసిటీ లభిస్తుంది. పైగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడంతో తొలి రెండు వారాలకే కావాల్సినంత వసూళ్ళు దక్కుతున్నాయి. నిర్మాతలకు లాభాలు చేకూర్చుతున్నాయి.
కోర్టు ఆదేశాలతో విడుదల చేశారు
ఇక మొన్నటికి మొన్న కేరళ స్టోరీ అనే సినిమా వచ్చింది. అదా శర్మ ఇందులో లీడ్ రోల్ లో నటించింది. అయితే ఈ సినిమాపై కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించాయి. చిత్ర నిర్మాణ సంస్థ కోర్టుకు వెళ్లడంతో.. కోర్టు సూచనల మేరకు ఆ రాష్ట్రాల్లో ఈ సినిమాలో విడుదల చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ లో కేరళ స్టోరీ సినిమాలో పోలీసు బందోబస్తు మధ్య స్క్రీన్ మీద చూపించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇప్పుడు ఈ కోవలోకి గోద్రా అనే సినిమా వస్తోంది. 2002లో గోద్రలో జరిగిన సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై ఈ సినిమా రూపొందించారు. సినిమా టైటిల్ పైనే ” ఇది ప్రమాదమా లేక కుట్ర” అని క్యాప్షన్ పెట్టారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత వివాదాస్పదమవుతుందో. దీనికి సంబంధించిన టీజర్ ను చిత్ర నిర్మాణ సంస్థ యూట్యూబ్లో విడుదల చేసింది.. అయితే గోద్రా అల్లర్లకు కారణమైన వాటిని విశ్లేషిస్తూ ఈ సినిమాను రూపొందించినట్టు టీజర్ చూస్తే అర్థమవుతున్నది. అంతేకాదు సబర్మతి ఎక్స్ ప్రెస్ పై దాడిని అత్యంత ఘోరమైనదిగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ అభివర్ణించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాణ సంస్థ పేర్కొన్నది.. మతపరమైన అల్లర్లకు దారి తీసిన ఈ సంఘటన ఉన్మాదంతో జరిగిందా? పక్కా ప్రణాళికతో చేసిందా? అనే విషయాలను బయటపెట్టినందుకు చిత్ర నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తున్నట్టు టీజర్ ద్వారా అర్థమవుతుంది. నానావతి కమిషన్ నివేదిక ఆధారంగా సినిమాను రూపొందించినట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది.
ఐదు సంవత్సరాల పరిశోధన
ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 5 ఏళ్ళు పరిశోధన చేసిన తర్వాత నిర్మాణంలోకి దిగామని చిత్ర దర్శకుడు శివాక్ష్ చెప్తున్నాడు. బిజె పురోహిత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఇందులో నటించిన వారి పేర్లను కూడా చిత్ర నిర్మాణ సంస్థ గోప్యంగా ఉంచుతున్నది. అయితే ఈ సినిమా టీజర్ పై బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ తరణ్ ఆదర్శ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు..ఈ ఈ సినిమా కూడా పలు వివాదాస్పద అంశాలను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందని ట్విట్టర్ ద్వారా ఆయన పేర్కొన్నారు.
ఎవరు టార్గెట్?
ట్రైలర్ చూస్తుంటే ‘గోద్రా’ అల్లర్లను కళ్లకు కట్టినట్టు తీశారు. చాలా రియలిస్టిక్ గా ఉంది. అయితే ఎవరికి అనుకూలంగా.. వ్యతిరేకంగా తీశారన్న షాట్స్ ఎక్కడా రివీల్ చేయలేదు. ఇప్పటికే కేరళ స్టోరీలాంటి చిత్రాలు వివాదాస్పదం కావడంతో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఈ ట్రైలర్ వీడియోను కట్ చేశారు. ఈ చిత్రం మోడీ టార్గెట్ గా తీసిందా? లేక కాంగ్రెస్ కు వ్యతిరేకంగానా? అన్నది తెలియడం లేదు. పూర్తి చిత్రం విడుదలైతే మాత్రమే టార్గెట్ ఎవరన్నది తెలుస్తుంది. బహుషా హిందూ దర్శక నిర్మాతల పేర్లు, హిందుత్వ పేర్లు ఉండడంతో ఇది మోడీకి ఫేవర్ గా ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. చిత్రం రిలీజ్ అయితే కానీ ఏ విషయం చెప్పలేదు. ట్రైలర్ మాత్రం ఎక్కడా విషయం బయటపెట్టకుండా గ్రిప్పింగ్ గా ఉంది.
‘GODHRA’ TEASER OUT NOW… #Godhra: Accident or Conspiracy teaser unveils… Directed by #MKShivaaksh… Produced by #BJPurohit and #RamKumarPal… In *cinemas* soon.#GodhraTeaser : https://t.co/jAI43tpalS pic.twitter.com/MquTPtQBZM
— taran adarsh (@taran_adarsh) May 30, 2023