
దేశంలో వేసవికాలం ఇప్పటికే మొదలైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వల్ల ఇంటి నుంచి పని చేస్తున్నారు. వేసవికాలంలో చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కొత్త ఏసీని కొనుగోలు చేయాలని భావిస్తుండగా కంపెనీలు వారికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి.
సాధారణంగానే ఏసీల ధరలు ఎక్కువగా ఉంటాయని సంగతి తెలిసిందే. ఈ ధరలు మరింత పెరిగితే ఏసీలు కొనుగోలు చేయాలని భావించే వాళ్ల జేబుకు చిల్లు పడినట్లేనని చెప్పవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈసారి ఏసీలకు భారీగా డిమాండ్ ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. గతేడాది కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల కంపెనీలు ఆశించిన స్థాయిలో ఏసీల అమ్మకాలు జరగలేదు. పలు కంపెనీలు ఏసీల కొనుగోలుపై క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈ.ఎం.ఐ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి.
ప్రముఖ కంపెనీలలో ఒకటైన డైకిన్ మెటల్, కంప్రెసర్ రేట్లు పెరగడంతో ఏసీల ధరలు పెరుగుతున్నాయని తెలిపింది. ధరల పెంపు ప్రభావం అమ్మకాలపై పెద్దగా ప్రభావం చూపదని కంపెనీలు చెబుతున్నాయి. పలు కంపెనీలు ఇప్పటికే ఏసీల ధరలను పెంచడం గమనార్హం. ఏసీలతో పాటు ఫ్రిజ్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 30 నుంచి 45 శాతం మధ్య అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని కంపెనీలు భావిస్తున్నాయి.
ముడిసరుకుల ధరలు పెరగడంతో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ మామూలుగా ఏసీల కొనుగోలు కోసం అయ్యే ఖర్చుతో ఉత్పత్తి వ్యయం 10 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నెలలో 5 శాతం ధరలు పెరుగుతుండగా వచ్చే నెలలో 5 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంది.