I.N.D.I.A. Alliance : ఇండియా’ కూటమిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆప్, తృణమూల్ కాంగ్రెస్

దీనికి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ నో చెప్పారు. చాలా కీలక బిల్లులు ఉన్నాయని.. వాటిపై కూడా ఆందోళన చేయవద్దని సూచించారు. ఫారెస్ట్ బిల్లు సహా పలు బిల్లులపై కూడా మనం ఆందోళన చేయకుండా బీజేపీని ఎండగట్టాలని సూచించారు. మొత్తంగా ఇండియా కూటమిలోనే విభేదాలు పొడచూపాయి.

Written By: NARESH, Updated On : July 29, 2023 4:35 pm
Follow us on

I.N.D.I.A. Alliance : ఇండియా కూటమి.. ఈ ప్రతిపక్షాల కూటమి ఇప్పుడు దేశాన్నే పేరు పెట్టుకుంటే బాగుండేది. డైరెక్ట్ గా భారత్ అనో..ఇండియానో అని పెట్టుకుంటే విమర్శించేవారికి ధైర్యం చాలదు. బెంగళూరులో ప్రతిపక్షాల కూటమి తర్వాత ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. కూటమిలోని పక్షాలు ఒకరిపై ఒకరు పోటీ చేయకుండా ఉంటారా?

ముఖ్యంగా బెంగాల్, పంజాబ్, కేరళ, ఢిల్లీలో ఒకరి మీద ఒకరు పోటీచేయకుండా ఇండియా కూటమి నిలబడుతుందా? అన్నది ప్రధాన ప్రశ్న. ముంబైలో మరో ఇండియా సమావేశంలో ఈ క్లారిటీ వస్తుందా? అన్నది చూడాలి.

ఇండియా కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఆప్ నేత ‘రాఘవ చద్దా’ అనే నేత వినూత్న ప్రపోజల్ చేశారు. మణిపూర్ పై లోక్ సభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేస్తున్నారని.. ఈ గొడవలు చేయకుండా ఆపాలని కోరారు. ఢిల్లీలో అధికారాలపై కేంద్రం పెట్టే బిల్లును వ్యతిరేకించాలని.. ఆ బిల్లుపై పార్లమెంట్ లోనే నిలదీయాలని.. కేంద్రాన్ని నిలదీయాలంటే మనం అందరూ పార్లమెంట్ లో ఆందోళన చేయకుండా వ్యతిరేకించాలని ఆప్ నేత కోరారు.

దీనికి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ నో చెప్పారు. చాలా కీలక బిల్లులు ఉన్నాయని.. వాటిపై కూడా ఆందోళన చేయవద్దని సూచించారు. ఫారెస్ట్ బిల్లు సహా పలు బిల్లులపై కూడా మనం ఆందోళన చేయకుండా బీజేపీని ఎండగట్టాలని సూచించారు. మొత్తంగా ఇండియా కూటమిలోనే విభేదాలు పొడచూపాయి.

ఇండియా’ కూటమిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆప్, తృణమూల్ కాంగ్రెస్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..