https://oktelugu.com/

G20 summit 2023 : పాకిస్తాన్ కుట్రల్ని భగ్నం చేసి విజయవంతమైన కాశ్మీర్ G-20 సమావేశాలు

ఆక్రమిత కశ్మీర్ అయితే చైనా-పాక్ లు ఎలా కారిడార్ కడుతారన్నది పాక్ సమాధానం చెప్పాలి. జీ20 కశ్మీర్ లో సక్సెస్ అయ్యింది. టూరిజంకు సంబంధించిన ఒక ఉపకమిటీ సమావేశం ఇది. సమావేశపరంగా ఇది అన్నింటికన్నా ముఖ్యం కాదు. శ్రీనగర్ లో జరిగిన ఈ సమావేశానికి విదేశీయులే ఎక్కువగా వచ్చారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 25, 2023 / 09:04 PM IST
    Follow us on

    G20 summit 2023 : పాకిస్తాన్ కుట్రలను భగ్నం చేసి శ్రీనగర్ లో జీ20 సమావేశాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఎందుకంటే.. భిలావల్ బుట్టో వచ్చి ఏమేం వాగినా పనిచేయలేదు. భారత్ గుర్తు పెట్టుకునే విధంగా గుణపాఠం చెబుతామని భిలావల్ హెచ్చరించారు. దీంతో కశ్మీర్ ప్రజల్లోనూ కోపం వచ్చాయి. కశ్మీర్ ను ఆక్రమిత ప్రాంతం అన్న పాకిస్తాన్.. ఈ ప్రాంతాన్ని చైనాకు ఎందుకు ధారదత్తం చేసిందన్నది చెప్పాలి.

    ఆక్రమిత కశ్మీర్ అయితే చైనా-పాక్ లు ఎలా కారిడార్ కడుతారన్నది పాక్ సమాధానం చెప్పాలి. జీ20 కశ్మీర్ లో సక్సెస్ అయ్యింది. టూరిజంకు సంబంధించిన ఒక ఉపకమిటీ సమావేశం ఇది. సమావేశపరంగా ఇది అన్నింటికన్నా ముఖ్యం కాదు. శ్రీనగర్ లో జరిగిన ఈ సమావేశానికి విదేశీయులే ఎక్కువగా వచ్చారు.

    జీ20లో టర్కీ, సౌదీ అరేబియా అఫీషియల్ గా రాలేదు కానీ వ్యాపార ప్రతినిధులు వచ్చారు. రేపొద్దున్న ఐరాసలో మేం బాయ్ కాట్ చేశామని చెప్పడానికి చేసింది కానీ.. ఇవి కశ్మీర్ ను వ్యతిరేకించడం లేదు.

    యూఏఈ, బంగ్లాదేశ్, నైజీరియా, లాంటి ముస్లిం దేశాల వారు హాజరయ్యారు. అనుకున్న దాని కన్నా జీ20 సమావేశాలు బాగా సక్సెస్ అయ్యింది. స్థానిక ప్రజలు దీనికి చాలా అత్యుత్సాహం చూపించారు.

    పాకిస్తాన్ కుట్రల్ని భగ్నం చేసి విజయవంతమైన కాశ్మీర్ G-20 సమావేశాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.