Article 370 of Kashmir : సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. రామజన్మభూమి తర్వాత అత్యంత కీలకమైన ఈ తీర్పు దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యేలా చేసింది. జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై ప్రశంసలు కురుస్తున్నాయి.
నిజానికి ఈ కశ్మీర్ సమస్యకు ప్రధాన కారణం నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే. నిజం చెప్పాలంటే చైనా విషయంలోనూ ఇదే తప్పులు చేసి చేతులు కాల్చుకున్నాడు.
మహరాజా హరిసింగ్ కావాలనే భారత్ లో కశ్మీర్ లో విలీనం చేశాడని అందరూ అనుకుంటున్నారు. పార్లమెంట్ లో కిరణ్ రిజుజు బయటపెట్టిన పత్రాలు చూస్తే జులైకి ముందే భారత్ లో కశ్మీర్ ను విలీనం చేయాలని ఆ ప్రాంత రాజు హరిసింగ్ ప్రయత్నాలు చేసిన మాట నిజం. అయితే ఎక్కడ సమస్య వచ్చిందంటే.. నెహ్రూ దానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే.. హేక్ అబ్దుల్లాను ప్రధానిని చేయాలని షరతు పెట్టాడు. అది మహారాజ హరిసింగ్ కు ఇష్టం లేదు. లేకపోతే స్వాతంత్య్రానికి ముందే కశ్మీర్ ను భారత్ లో కలపడానికి హరిసింగ్ సంతకం పెట్టేవాడు.
షేక్ అబ్దుల్లాను ప్రధానిని చేసి మహారాజ హరిసింగ్ ను కశ్మీర్ నుంచి నెహ్రూ వెళ్లగొట్టాడు. ముంబైలో చనిపోయేవరకు హరిసింగ్ బతికాడు. కశ్మీర్ రాజును వెళ్లగొట్టి దానిని షేక్ అబ్దుల్లా చేతిలో పెట్టిన దారుణం నెహ్రూను చేశాడు.
సుప్రీం కోర్టు తీర్పుతో కాశ్మీర్ వేర్పాటు వాదానికి పూర్తి సమాధి కానుంది.. ఈ క్రమంలోనే నటి పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.