Donald Trump: అమెరికాలో బైడెన్‌కు ఎదురు గాలి.. మళ్లీ ట్రంపేనా?

గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన సర్వేలోనూ ఇవే ఫలితాలు వచ్చాయి. 2023 డిసెంబర్‌లో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నిర్వహించిన పోల్‌లో బైడెన్‌కు అతి తక్కువ అప్రూవల్‌ రేటింగ్‌ వచ్చింది. గతేడాది నిర్వహించిన అనేక సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి.

Written By: Raj Shekar, Updated On : February 6, 2024 4:04 pm

Donald Trump

Follow us on

Donald Trump: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది చివరన అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు రిపబ్లిక్, డెమొక్రటిక్‌ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. సర్వే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా గాల్లప్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్‌ను తిరిగి అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు కేవలం వ38 శాతం మాత్రమే మద్దతు తెలిపారు. ఇదే సమయంలో ట్రంప్‌ను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు 50 శాతం మంది అమెరికన్లు మద్దతు ఇస్తున్నారు.

డిసెంబర్‌ సర్వేలో కూడా..
గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన సర్వేలోనూ ఇవే ఫలితాలు వచ్చాయి. 2023 డిసెంబర్‌లో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నిర్వహించిన పోల్‌లో బైడెన్‌కు అతి తక్కువ అప్రూవల్‌ రేటింగ్‌ వచ్చింది. గతేడాది నిర్వహించిన అనేక సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. దీంతో డెమొక్రటిక్‌ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

వయోభారమే..
ఇక బైడెన్‌ను వద్దనడానికి కారణాలను కూడా కొన్ని సర్వే సంస్థలు విశ్లేషించాయి. అతడిపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా.. పాలనలో చురుకుదనం లేకపోవడం, వయోభారం కారణంగానే బైడెన్‌ వద్దనుకుంటున్నారట. మరోవైపు మెక్సికోతో సరిహద్దు వివాదం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు కూడా బైడెన్‌పై వ్యతిరేకతకు కారణంగా సర్వే సంస్థలు చెబుతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ వయసుపై కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ, బైడెన్‌తో పోలిస్తే.. ట్రంపే బెటర్‌ అని అనుకుంటున్నారని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి.