Bihar Election Battle : బీహార్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ కూడా ఆలోచనలో పడింది. మోడీ నాయకత్వం ఒక్కటే సరిపోదు అని అర్థమైంది. కేంద్రంలో అధికారం మోడీ వల్ల సాధ్యమవుతుంది. కానీ రాష్ట్రాల్లో మోడీ మేనియా పనిచేయడం లేదని తేలింది. జనంలో చైతన్యం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి ఆయా రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వం బలంగా ఉండాలని కోరుకుంటోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో బలమైన నేత ఉండాలని కోరుకుంటోంది. ప్రజలకు మోడీ మీద సానుభూతి ఉన్నా.. రాష్ట్రాల కోణంలోనే జనాలు చూస్తున్నారు. స్థానికంగా అవినీతిలేని సంక్షేమ పంచే పార్టీ వైపే చూస్తున్నారు.
మోడీ వచ్చి రాష్ట్రాల్లో పరిపాలన చేయడని జనం ఫిక్స్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లాంటి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి మోడీతోపాటు యోగి లాంటి స్ట్రాంగ్ నాయకుడు ఉన్నాడు కాబట్టే బీజేపీ గెలిచింది. కాబట్టి ఉత్తరప్రదేశ్ అత్యంత ప్రాముఖ్యత గల రాష్ట్రం బీహార్. 40 పార్లమెంట్ స్థానాలున్నాయి.
బీహార్ లో బీజేపీకి పలు సమస్యలున్నాయి. అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా ఓట్లు వారికే పోలరైజ్ అవుతున్నాయి. ఒక పార్టీగా వారికి సమాన స్థాయిలో బీజేపీ ఓట్లు తెచ్చుకుంటోంది. బీజేపీకి మైనస్ ఏంటంటే.. చరిష్మా ఉన్న లీడర్ లేడు. అందుకే గెలుపు అనేది సాధ్యమవుతోంది.
2024 బీహార్ ఎన్నికల యుద్ధం తేజస్వీ యాదవ్ vs చిరాగ్ పశ్వాన్ జరుగబోతోందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.