Tollywood: సినిమా రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళల్లో చాలామంది చాలా కిందిస్థాయి నుంచి వచ్చిన వాళ్లే ఉంటారు. అయితే.. తమ ఎదుగుదలతో ఎందరికో స్ఫూర్తిని నింపే వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. తమకు బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. కేవలం తమ టాలెంట్ నే నమ్ముకుని సినిమా పరిశ్రమలో ఎదిగి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని కొత్త వాళ్లకు ప్రేరణగా నిలిచిన కొంతమంది గురించి తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ :

రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఇప్పుడు పరిచయం అవసరం లేని స్థాయికి వెళ్ళాడు.
సాయి పల్లవి :

సాయి పల్లవికి సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఫిదాతో టాలీవుడ్ ను ఫిదా చేసేసింది. కానీ, మీకు తెలుసా? ఢీ అనే షోలో ఒక సాధారణ డ్యాన్సర్ గా ఆమె తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. అలాగే, మీరా జాస్మిన్, విశాల్ కాంబినేషన్ లో వచ్చిన ‘పందెం కోడి’ అనే సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా కూడా నటించింది. మొత్తానికి జూనియర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
త్రిష :

త్రిష కూడా జూనియర్ ఆర్టిస్ట్ గానే కెరీర్ స్టార్ట్ చేసింది. మొదట్లో ఆమె ఓ మేనేజర్ దగ్గర అసిస్టెంట్ గా కూడా పని చేసింది. ఆ తర్వాత జోడి సినిమాలో సిమ్రాన్ కు ఫ్రెండ్ గా నటించింది. చివరకు వర్షం సినిమాతో తెలుగు స్క్రీన్ పై తనదైన ముద్ర వేసింది.
రవితేజ :

రవితేజ సినీ జర్నీ చాలా గొప్పది. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా.. ఫైనల్ గా స్టార్ హీరోగా రవితేజ తన మార్క్ చూపించాడు.
కాజల్ అగర్వాల్ :

తెలుగులో దశాబ్ద కాలానికి పైగా అగ్రతారగా కొనసాగింది కాజల్ అగర్వాల్. కానీ 2004లో విడుదలైన హిందీ సినిమా “క్యూన్! హో గయా నా” హిందీ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఐశ్వర్య రాయ్ కు ఫ్రెండ్ గా నటించింది.
అనసూయ :

ఆల్ టైమ్ బ్యూటీ అనసూయ కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో చాలా చిన్న పాత్రలో నటించింది. ఆమె జూనియర్ ఆర్టిస్ట్ గానూ పని చేసింది.
Also Read: Ranbir Kapoor Alia Bhatt:అరడజను మందిని ప్రేమించి అలియానే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ?
నవీన్ పొలిశెట్టి :

నవీన్ పొలిశెట్టి అంటే ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న యంగ్ హీరో. కానీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వన్-నేనొక్కడినే, డి ఫర్ దోపిడి వంటి చిత్రాల్లో చాలా చిన్న పాత్రల్లో నవీన్ పొలిశెట్టి నటించాడు.
హీరోయిన్ రీతు వర్మ :

హీరోయిన్ రీతు వర్మ కూడా పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మారింది. కానీ అంతకు ముందు ఆమె ఎన్టీఆర్ ‘బాద్షా’ సినిమాలో కాజల్ కు చెల్లి గా చాలా చిన్న పాత్రలో నటించింది.
శర్వానంద్ :

హీరో శర్వానంద్ కూడా యువసేన సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడిగా నటించాడు. చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసాడు.
విజయ్ సేతుపతి :

విజయ్ సేతుపతి కూడా జూనియర్ ఆర్టిస్ట్ గానే కెరీర్ స్టార్ట్ చేశాడు. ధనుష్, కార్తీ, జయం రవి లాంటి హీరోల సినిమాల్లో విజయ్ సేతుపతి చాలా సైడ్ క్యారెక్టర్స్ చేసాడు
Also Read: Dharmana Brothers: అన్నకు ‘అవినీతి’చురక.. ధర్మాన సోదరుల మధ్య రాజకీయ అగాధం