Telugu Anchor: బుల్లితెరపై సత్తాచాటుతూనే ఎంతోమంది అందమైన తెలుగు యాంకర్లు వెండితెరపై రాణిస్తున్నారు. అప్పట్లో యాంకర్ సుమ, ఉదయభాను, ఝాన్సీలు బుల్లితెరపై ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత యాంకర్ అనసూయ, శ్రీముఖి, రష్మిలు బుల్లితెరకు గ్లామర్ డోస్ ను పరిచయం చేశారు. ప్రస్తుతం వస్తున్న యాంకర్లంతా ఈ ముగ్గురు చూపిన దారిలో నడుస్తూ బుల్లితెర యాంకర్లు గ్లామర్ విషయంలో హీరోయిన్లకు తక్కువేమీ కాదని నిరూపిస్తున్నారు.

వీరిలో యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన అందచందాలతో, చురుకైన మాటలతో శ్రీముఖి యాంకరింగ్ కే అందం తీసుకొచ్చింది. బుల్లితెరపై ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండటంతో సినిమాల్లోనే ఆమె అవకాశాలు వెతుకుంటూ వస్తున్నాయి. ఓవైపు టీవీ షోలు, ఈవెంట్స్ మరోవైపు సినిమాలు చేస్తూ బీజీగా స్టార్ గా శ్రీముఖి మారిపోయింది.

శ్రీముఖి సోషల్ మీడియా యాక్టివ్ ఉంటూ తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. తన ఇన్ స్ట్రాగ్రామ్ లేటెస్ట్ ఫొటో షూట్స్, వీడియోలు, సినిమా అప్ డేట్స్ ఇస్తూ అందరి అటెన్షన్స్ తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా ఆమె ఓ ఫోటోషూట్ కు సంబంధించిన పిక్స్ ఇన్ స్టాలో పోస్టు చేసింది. కలర్ ఫుల్ డ్రెస్సులో హాట్ లుక్స్ అందాల విందును పంచుతున్న ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మోడ్రన్ డ్రెస్సులో కుర్రకారును ఆకట్టుకునే శ్రీముఖి అందం సారీలో మాత్రం ‘అంకుల్స్’ ను తనవైపు తిప్పుకుంటుంది. కొంతకాలం యాంకర్ కు విరామం ప్రకటించిన శ్రీముఖి ‘బిగ్ బాస్-4’ షోలో పాల్గొని రన్నర్ గా నిలిచింది. ఆ క్రేజ్ తో ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో నటించింది. ఈ మధ్య ఆ సినిమా విడుదై మంచి టాక్ తెచ్చుకుంది.

శ్రీముఖి ప్రస్తుతం ‘టచ్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో శ్రీముఖి పోలీస్ పాత్రలో కన్పించనుండటం విశేషం. ఇందులో దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్ ఉందనే గాసిప్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంటుందనే టాక్ విన్పిస్తోంది.