Markram’s Century: చారిత్రాత్మకమైన విజయానికి ప్రోటీస్ జట్టు ఇంకా 69 పరుగుల దూరంలో ఉంది.. నాలుగో రోజు వాతావరణంలో ఎలాంటి తేడా లేదు. వర్షం కురిసే అవకాశం లేదు. అందువల్ల ప్రోటీస్ జట్టు విజయానికి డోకా లేదు. ఏదైనా సంచలనం చోటు చేసుకుంటే తప్ప కంగారు జట్టు గెలిచే పరిస్థితి లేదు.
ఇప్పటికే కమిన్స్ అలసిపోయాడు. స్టార్క్ లయను కోల్పోయాడు. హేజిల్ వుడ్ సంచలనం సృష్టించలేకపోతున్నాడు.. లయన్ అదరగొట్టలేకపోతున్నాడు.. హెడ్ సత్తా చూపించలేకపోతున్నాడు. ఈ బౌలర్లందర్నీ మార్క్రం ఒక ఆట ఆడుకున్నాడు. ఒకరకంగా అడ్డుగోడ లాగా నిలబడ్డాడు.. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టును విజయతీరాల వరకు తీసుకొచ్చాడు. తన కెరియర్లో మార్క్రమ్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడి ఉండవచ్చు.. కానీ డబ్ల్యూటీసీ తుది పోరులో రెండవ ఇన్నింగ్స్ లో కంగారు జట్టుపై అతడు చేసిన సెంచరీ చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడం లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జట్టుకు సంజీవని లాంటి ఇన్నింగ్స్ ఆడాడు కార్క్రం.
Also Read: Aiden Markram : ఓ ఇంటివాడైన ఎస్ఆర్.హెచ్ కెప్టెన్.. అమ్మాయి ఎవరో తెలుసా..?
సెంచరీ చేసిన తర్వాత
మార్క్రం సెంచరీ చేసిన తర్వాత మైదానంలో హర్షద్వానాలు మిన్నంటాయి. తోటి ప్లేయర్లు అమాంతం లేచి అతడికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. లేచే నిలబడి చప్పట్లు కొడుతూ అతడిని అభినందించారు. హేజిల్ వుడ్ బౌలింగ్లో బౌండరీ కొట్టడంతో మార్క్రం స్కోరు 102 పరుగులకు చేరుకుంది. దీంతో అతడి ఆనందానికి అవధి లేకుండా పోయింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మార్క్రం ఆడిన ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. మార్క్రం సెంచరీ చేస్తున్నప్పుడు లార్డ్స్ మైదానంలోనే ఉన్నాడు మిస్టర్ 360 డివిలియర్స్. మార్క్రం సెంచరీ చేసిన తర్వాత డివిలియర్స్ ఆనందానికి అవధి అంటూ లేకుండా పోయింది. అంతేకాదు అతడు సెంచరీ చేసిన క్షణాలను తన ఫోన్లో బంధించి మురిసిపోయాడు డివిలియర్స్.. వాస్తవానికి డివిలియర్స్ లాంటి ప్లేయర్ ఆడుతుంటే చూసి క్రికెట్ నేర్చుకున్న మార్క్రం.. అతడి ముందు సెంచరీ చేయడం ఒక గొప్ప అనుభూతి అయితే.. ప్రపంచంలోనే అత్యద్భుతమైన లార్డ్స్ మైదానంలో సెంచరీ చేయడం మర్చిపోలేని జ్ఞాపకం. డివిలియర్స్ లార్డ్స్ మైదానంలో మార్క్రం సెంచరీ చేసిన క్షణాలను బంధిస్తుంటే.. మీడియా ప్రతినిధులు ఆ ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నాయి.. తన జట్టు గెలుపు బాటలో ప్రయాణం చేస్తుంటే డివిలియర్స్ ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు.మార్క్రం సెంచరీ చేసిన తర్వాత ఆ అద్భుతమైన జ్ఞాపకాలను బంధించుకున్నాడు.. జట్టును ఇంతకంటే గొప్పగా ఎవరి ప్రేమిస్తారని నెటిజన్లు పేర్కొంటున్నారు.
మిస్టర్ 360 గతంలో ప్రోటీస్ జట్టుకు గొప్ప ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఆ జట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించిన మేజర్ టోర్నీలలో ట్రోఫీలు అందుకోలేకపోయింది. అద్భుతమైన ఆటగాడిగా పేరుపొందిన డివిలియర్స్ క్రీడా జీవితంలో అది ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అతడి ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ.. అతడి కళ్ళ ముందు సొంత జట్టు విజేతగా నిలుస్తున్న నేపథ్యంలో.. మిస్టర్ 360 ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.