దీపికా పిల్లి క్రిస్మస్ సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టిన పోటోలు తెగ వైరల్ గా మారాయి.
తెలంగాణలోని హైదరాబాద్లో ఏప్రిల్ 15, 1999న జన్మించింది. ఈ బ్యూటీ వినోద పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.
నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దీపిక పలు ప్రాజెక్టుల్లో కనిపించింది కూడా.
వాంటెడ్ పాండుగాడ్, కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్, సర్కార్ వంటి వాటిలో కనిపించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది.
ఇక వాంటెడ్ పాండుగాడ్ ఆగస్టు 2022లో విడుదలైంది. ఈ తెలుగు భాషా హాస్య చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో దీపికతోపాటు సునీల్, సుడిగాలి సుధీర్ వంటి ప్రముఖ నటులు నటించారు.
ఈ రెడ్ స్వెటర్ ఆమె శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తూనే కుర్రకారును కట్టిపడేస్తుంది.
ఇలా ఎప్పుడు కొత్తధనంతో కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడయాలో ఎక్కువగా రచ్చ లేపుతుంది.