https://oktelugu.com/

Boyapati srinu : ఈ కమర్షియల్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…హీరోలకంటే ఎక్కువ తీసుకుంటున్నారా..?

ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా ఎదగాలంటే ఎవరైనా సరే కమర్షియల్ సినిమాలు చేయాల్సిందే. ఎందుకంటే ఈ కమర్షియల్ ఫార్మాట్ లోనే హీరోలకు ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి. ఇక రకరకాల ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడంలో కమర్షియల్ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. ఏ సెంటర్ నుంచి బీ, సీ సెంటర్ వరకు ప్రతి ఒక్కరు కమర్షియల్ సినిమాలకు ఏదో ఒక రకంగా కనెక్ట్ అవుతూ ఉంటారు ...

Written By:
  • Gopi
  • , Updated On : October 28, 2024 / 05:05 PM IST

    You will be shocked to know the remuneration of these commercial directors...are they taking more than the heroes

    Follow us on

    Boyapati srinu : సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకు చాలా గుర్తింపు ఉండేది. స్టార్ హీరోలందరూ కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండేవారు. ఇక ఇప్పటికి కూడా కమర్షియల్ సినిమాలను చేస్తున్నప్పటికి ఆయా సినిమాలకు చిన్నగా గ్రాఫిక్స్ టచ్ ఇస్తూ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ప్రేక్షకులను మైమరపించే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తెలుగులో కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు ప్రస్తుతం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నారు. నిజానికి బోయపాటి శ్రీను లాంటి దర్శకుడు బాలయ్య బాబుతో మాత్రమే భారీ సక్సెస్ లను అందుకుంటూ ఉంటాడు. కానీ తను మాత్రం ఒక సినిమా కోసం దాదాపు 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
    పటాస్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి…అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అనేది లేదు కాబట్టి ఆయన మినిమం గ్యారంటీ దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తో చేస్తున్న సినిమా కోసం అనిల్ ఏకంగా  30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను  తీసుకున్నట్లుగా తెలుస్తుంది…
    డాన్ శీను సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్ మలినేని ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక రీసెంట్ గా వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన బాలీవుడ్ లో సన్నీ డియోల్ తో కలిసి ఒక భారీ సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఆయన భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది…మరి ఈ సినిమాతో అయినా ఎలాంటి ప్రభంజనాన్ని  సృష్టిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా భారీ సక్సెస్ సాధిస్తే ఇకమీదట ఆయన 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్  తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
    ఇక మిరపకాయ్, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకున్న హరీష్ శంకర్ కూడా ప్రస్తుతం 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుండటం విశేషం…ఇక రీసెంట్ గా ‘మిస్టర్ బచ్చన్ ‘ సినిమా ప్లాప్ అయిన సందర్భంగా ఆయన రెమ్యూనరేషన్ అనేది ఇప్పుడు భారీగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది…
    ఇక ఏది ఏమైనా కూడా ఏ కమర్షియల్ డైరెక్టర్లు భారీ ఎలివేషన్స్ ఇవ్వడంలో సూపర్ సక్సెస్ లను సాధించారు. అందువల్లే వీళ్ళు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు…ఇక ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ హీరోలకంటే కూడా వీళ్ళ రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటుందంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి…