https://oktelugu.com/

Prashant Neil : ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తే మాస్ హీరో ఇమేజ్ వస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం ప్రేక్షకులు వాళ్ళని మర్చిపోయే అవకాశం అయితే ఉంటుంది. రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలు చేస్తూనే ముందుకు సాగుతాం అనుకునే వాళ్లకు ఈ రోజుల్లో కాలం చెల్లిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే యంగ్ హీరోలు ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంటే స్టార్ హీరోలు మాత్రం అదే మూస ధోరణి లో వెళ్తే వాళ్ళ ఇమేజ్ కి భారీ డామేజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 08:38 AM IST

    Will you get a mass hero image if you do a movie with Prashant Neil?

    Follow us on

    Prashant Neil : సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగాలి అంటే హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవాలి. ముఖ్యంగా స్టార్ హీరో ఇమేజ్ ఎప్పుడు వస్తుంది అంటే మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులకి దగ్గర అయినప్పుడే వాళ్లకు మార్కెట్ పరంగా అయినా ప్రేక్షకుల్లో క్రేజ్ అయిన తారాస్థాయిలో పెరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరోలు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది స్టార్ హీరోలు సెలెక్టెడ్ డైరెక్టర్లతో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు… ‘కేజిఎఫ్’ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్చేసుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించడానికి ఇండియాలో ఉన్న చాలామంది హీరోలు ఉత్సాహాన్ని చూపిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

    ఇక ఇప్పటికే ఎన్టీఆర్ దేవర సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకునే ప్రయత్నం చేసినప్పటికి ఈ సినిమాకి కేవలం 300 కోట్ల కలెక్షన్లు మాత్రమే రావడంతో ఆయన చాలావరకు డీలా పడ్డాడు. ఎలాగైనా సరే ప్రశాంత్ నీల్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దానికోసమే వీళ్లిద్దరు తీవ్రమైన కసరత్తులను చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరో ఇమేజ్ ను అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తనకంటూ ఒక సక్సెస్ ని సాధించడంలో మాత్రం చాలా వరకు డీలా పడిపోతున్నాడు.

    మరి ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు అతన్ని చాలా స్టార్ లెవెల్లో చూపించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించి పెట్టడంలో ఫెయిల్ అయిపోతున్నాయి. ఇక అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తేనే ఆయన పాన్ ఇండియాలో ఎలివేట్ అవుతారని నమ్ముతున్నాడు.

    అందుకే ప్రశాంత్ నీల్ ను సెలెక్ట్ చేసుకొని మరి అతనితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు… ఇక ప్రశాంత్ నీల్ కి కూడా జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం… అందుకే వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న సినిమా మాస్ లో విపరీతమైన క్రేజీ ను సంపాదించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…