Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓజీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతుందా..? అసలు ఇది ఎప్పుడు పూర్తవుతుంది..?

సినిమా ఇండస్ట్రీ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఇక్కడ స్టార్ హీరోలకి ఒకలా మిగతా హీరోలకు మరొకలా ఉండదు. ఇక టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్లు సినిమా ఇండస్ట్రీలో చాలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ రాణించాలని ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతుంటారు... ఇక ఏది ఏమైనా కూడా తమకు తాము స్టార్ హీరోలుగా గుర్తుంచుకునే పరిస్థితిలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి...

Written By: Gopi, Updated On : October 26, 2024 2:22 pm

Will Pawan Kalyan hit Oji with blow after blow..? When will it be completed?

Follow us on

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కూడా కొనసాగిస్తున్నాడు. ఇక ఒకప్పుడు ఆయన భారీ స్టార్ డమ్ ని అందుకొని స్టార్ హీరో రేస్ లో ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు పొలిటిషన్ గా మారి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తను డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను చేపట్టకముందు నుంచి కూడా ఆయన చేస్తున్న కొన్ని సినిమాలు  సెట్స్ మీదే ఉండిపోయాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదనే ఉంది. ఆయన ఎలాగైనా సరే వీలైనంత తొందరగా ఈ సినిమాని పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ కొంతవరకు నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.
సుజిత్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తొందరగా పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి పవన్ కళ్యాణ్ మాత్రం ‘హరిహర వీరమల్లు’ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఓజీ సినిమా మీద తన ఫోకస్ ను పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే సుజిత్ ఈ సినిమా మీద దాదాపు మూడు సంవత్సరాలుగా వర్క్ చేస్తూనే ఉన్నాడు. అయిన కూడా ఇప్పటికీ ఈ సినిమా అయితే ఒక కొలిక్కి రాలేదు. అయినప్పటికీ అది ఎప్పుడు పూర్తవుతుందనే విషయంలో కూడా సరైన క్లారిటీ అయితే లేదు. కాబట్టి సుజిత్ ఈ సినిమా మీద చాలా విసిగిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అందుకే తను బయట వేరే హీరోలను అప్రోచ్ అవుతూ వాళ్లకి కథలను కూడా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక నానితో ఒక సినిమా స్టార్ట్ చేయాలని చూసిన సుజిత్ ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో ఆయన భారీ ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక పార్లల్ గా ఇటు ఈ సినిమా చేస్తూనే అటు మరొక సినిమా కూడా చేసి సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే హరీష్ శంకర్ కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను  పక్కన పెట్టి రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా కూడా రేంజ్ లో ఆడలేదు. ఇప్పుడు రామ్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు…