https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు పూరి కి మధ్య ఎక్కడ చెడింది…వీళ్ళ కాంబోలో మరొక సినిమా వస్తుందా..?

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఉంటుంది. కొంతమందికి ఇక్కడ సక్సెస్ లు వస్తుంటే మరి కొంతమంది మాత్రం టాప్ పొజిషన్ లోకి వెళ్లి అక్కడ నుంచి చాలా తక్కువ సమయంలోనే ప్లాప్ సినిమాలను తీసి కింద పడిపోతూ ఉంటారు. ఇక ఇలాంటివారు సినిమా ఇండస్ట్రీలో మళ్లీ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగాలంటే మాత్రం తీవ్రమైన కసరత్తులు చేయాల్సిన అవసరం అయితే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2024 / 08:21 AM IST

    What happened between Mahesh Babu and Puri... Will there be another movie in their combo?

    Follow us on

    Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డైరెక్షన్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్న ను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా చాలామంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన ఘన చరిత్ర కూడా అతనికే దక్కుతుంది. వరుస సినిమాలతో తనకంటూ ప్రేక్షకుల్లో ఒక భారీ ఇమేజ్ ను క్రియేట్ చేసిన పూరి జగన్నాధ్ ఆ తర్వాత చేసిన చాలా సినిమాలను ఇండస్ట్రీలో మంచి విజయాలుగా మార్చడమే కాకుండా రవితేజ, మహేష్ బాబు లాంటి మాస్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చడంలో తను కీలకపాత్ర వహించాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో ఈ జనరేషన్ కి తగ్గట్టుగా మాటలు రాయడం గాని, ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు సినిమాలో పెట్టడంలో ఆయన ఎప్పుడూ సక్సెస్ అవుతూ వచ్చాడు. ఇక మొత్తానికైతే పూరి జగన్నాధ్ లాంటి ఒక దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈయన లాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీ లో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలా మీద సినిమాలు చేయడంలో ఆయన దిట్ట…

    ఇక మహేష్ బాబుతో పోకిరి, బిజినెస్ మేన్ లాంటి సినిమాలు చేసి ఆ రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో మూడో సినిమా చేయాలనుకుంటున్నాడు. అయితే వీళ్ళ కాంబినేషన్ లో జనగణమన అనే సినిమా రావాల్సింది. కానీ పూరి జగన్నాధ్ ఫ్లాపుల్లో ఉన్నాడనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు పూరి జగన్నాధ్ ను పట్టించుకోవడం మానేశాడు.

    దాంతో రెండు మూడు సార్లు మహేష్ బాబు తో కథ గురించి డిస్కషన్ చేసిన పూరి జగన్నాధ్ ఆయన నుంచి పెద్దగా రెస్పాండ్ రాకపోవడంతో ఆయనను పక్కన పెట్టి మిగతా హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు మాత్రం పూరి జగన్నాధ్ కి అవకాశం ఇవ్వడం లేదు.

    ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం పూరి జగన్నాధ్ సక్సెస్ లో లేడు కాబట్టి అతన్ని పట్టించుకునే హీరోలు కూడా కరవయ్యారు. మరి మరోసారి తనకంటూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలి లేకపోతే మాత్రం పూరి జగన్నాధ్ కి ఇండస్ట్రీ లో మళ్లీ అవకాశాలైతే లేకుండా పోవచ్చు…