https://oktelugu.com/

Pawan Kalyan & Trivikram : పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన త్రివిక్రమ్…వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చిందా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సూపర్ సక్సెస్ లను అందించే దర్శకులతో వాళ్లు సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్లు మంచి కథలను రాసి సినిమాలు చేస్తేనే స్టార్ రేంజ్ లో కొనసాగుతున్న హీరోల హవా అనేది మరింతలా పెరుగుతుంది. కాబట్టి దర్శకులతో మంచి సంబంధాలను కలిగి ఉంటే మంచి సినిమాలను హీరోలతో చేసి సూపర్ సక్సెస్ లను అందించడానికి అవకాశాలు ఉంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 10:34 AM IST

    Trivikram who gave a shock to Pawan Kalyan... Is there a gap between them?

    Follow us on

    Pawan Kalyan & Trivikram : మాటల మాంత్రికుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… మొదట రైటర్ గా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత దర్శకుడిగా మారి వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇంతకుముందు మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు చేయబోయే సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి దర్శకుడు తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో చాలావరకు కృషి చేశాడు. కాబట్టి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలావరకు గొప్ప కీర్తిని తీసుకొచ్చారనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా మంచి సన్నిహితులనే విషయం మనకు తెలిసిందే. వీళ్లిద్దరూ ఫ్రెండ్సే కాకుండా సొంత ఫ్యామిలీ మెంబర్స్ ల ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేయాలి. ఏ సినిమాలైతే ఇప్పుడు ఆయనకి సరిగ్గా సరిపోతాయి. ఆ సినిమాలు ఎలా ఉండాలి. అందులో సీన్స్ ని ఎలా రాయాలి అనేది త్రివిక్రమ్ దగ్గరుండి మరి చూసుకుంటాడు. ముఖ్యంగా రీమేక్ సినిమాలను మార్చి రాసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా సెట్ చేసి సినిమాను చేయించడంలో త్రివిక్రమ్ ముందు వరుసలో ఉంటాడు. అందువల్లే వీళ్ళిద్దరికీ మంచి బాండింగ్ అయితే కుదిరింది. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి నటుడు త్రివిక్రమ్ లాంటి దర్శకుడు తో కలిసి చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ వచ్చాయి.

    ఇక పర్సనల్ విషయాలకి వెళ్తే వీళ్లిద్దరికి చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. ఇద్దరు బుక్స్ చదవడం అలవాటుగా పెట్టుకుంటారు. కాబట్టి ఒకరి గురించి మరొకరు డిస్కషన్ చేసుకునే దానికంటే వీళ్ళిద్దరూ కలిసిన ప్రతిసారి ఎక్కువగా పుస్తకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారట.

    ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఈ సమయం లో త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయని అందువల్లే వీళ్ళిద్దరికీ కాంటాక్టు సరిగ్గా లేదని కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

    మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. ఇక మొత్తానికైతే ఇంతకు ముందులా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ను తరచుగా కలుసుకోవడానికైతే వీలు కావడం లేదంటూ చాలామంది వాళ్ళ సన్నిహితులు కూడా చెబుతున్నారు…