Rajamouli : రాజమౌళి సినిమాల్లో ఈ ఆర్టిస్టులు తప్పకుండా ఉంటారు…కారణం ఏంటో తెలుసా..?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ రాజమౌళికి ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని సృష్టించిన ఆయన త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ ప్రశంసలను కూడా అందుకున్నాడు... రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : October 29, 2024 10:32 am

These artists will definitely be in Rajamouli's movies...do you know the reason..?

Follow us on

Rajamouli : స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడి గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాజమౌళి ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న రాజమౌళి తనదైన రీతిలో సినిమాలు చేయడానికి చాలా ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆయన చాలావరకు కష్టపడుతూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాను చేస్తున్న ఆయన ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి చేస్తున్న మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో కొంతమంది ఆర్టిస్టులైతే రెగ్యూలర్ గా కనిపిస్తూ ఉంటారు. ఇంతకీ ఆ ఆర్టిస్టులు ఎవరు అంటే రాజీవ్ కనకాల, ఛత్రపతి శేఖర్…వీళ్ళు రాజమౌళి తీసే ప్రతి సినిమాలో ఉంటారు. ఎందుకంటే రాజమౌళి ఇండస్ట్రీకి రాకముందు నుంచే అతనికి చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.

నిజానికి రాజమౌళి మొదట్లో చేసిన శాంతినివాసం సీరియల్ సమయంలోనే వీళ్లకు మంచి బాండింగ్ అయితే కుదిరింది. దానివల్లే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక క్యారెక్టర్ లో అయితే వీళ్ళని తీసుకుంటూ ఉంటాడు. అందుకే ప్రతి సినిమా విషయంలో వీళ్ళకి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని ఇస్తూ వాళ్లను కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు.

రాజమౌళి తన ఫ్రెండ్ సర్కిల్లో మంచి టాలెంట్ ఉంది అనుకుంటే మాత్రం వాళ్ళను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటులను కూడా రాజమౌళి ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నాడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆయనకు నచ్చితే వాళ్లకి ప్రత్యేకంగా ఆయన సినిమాలో ఒక క్యారెక్టర్ అయితే ఇస్తాడు.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న రాజమౌళి ఇప్పుడు భారీ సక్సెస్ ని సాధించడానికి పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. మరి అక్కడ కూడా భారీ సక్సెస్ లను సాధించాలని కోరుకుందాం…