Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం మీద వస్తున్న విమర్శలకు చెక్ పెడుతున్న ‘క’ ట్రైలర్…

యంగ్ హీరోల హవా నడుస్తున్న సమయంలో కిరణ్ అబ్బవరం లాంటి హీరో ఇప్పుడు వినూత్నమైన రీతిలో సరికొత్త ప్రయోగాలు చేయడం అనేది తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా ఉండటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. చిన్న హీరో అయిన కూడా పాన్ ఇండియా సబ్జెక్టును ఎంచుకొని సినిమాలు చేస్తుండటం ఒక రకంగా మంచి విషయమనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : October 25, 2024 4:01 pm

The trailer of 'Ka' checks the criticism coming on Kiran Abbavaram...

Follow us on

Kiran Abbavaram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొత్త కథలతో సినిమాలను చేయడంలో వీళ్ళు ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్లకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలు వైవిద్య భరితమైన కథాంశాలతో సినిమాలను చేస్తుండటం విశేషం… ఇక అందులో భాగంగానే కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘క ‘ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేశారు. మొత్తానికైతే తెలుగుకి మాత్రమే పరిమితమైన కిరణ్ అబ్బవరం వైవిధ్యభరితమైన కథాంశాన్ని ఎంచుకోవడం అనేది నిజంగా ఆయన అభిమానుల్ని ఆనందానికి గురిచేస్తుంది. ఇక క సినిమా ట్రైలర్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లైతే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. దర్శకుడు ఈ ట్రైలర్ ని కట్ చేసిన విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో హీరో చాలా కొత్తగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక కథ కూడా చాలా కొత్తగా ఉంది. పోస్ట్ మాన్ గా పని చేస్తున్న కిరణ్ అబ్బవరం తనకి ఒక ఉత్తరం వచ్చినప్పుడు దాన్ని చదివి ఎలా రియాక్ట్ అయ్యాడనేదే సినిమా అయితే ఒక హిప్నటైజ్ చేసే ఆయన వశీకరణానికి లోనైనట్టుగా కూడా తెలుస్తుంది.
తద్వారా ఆయన ఏం చేశాడు ఆ ఉత్తరంలో ఏముంది అనేదే ఈ సినిమాలో సస్పెన్స్ గా పెడుతూ డైరెక్టర్ సినిమాను నడిపించినట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం సినిమాలో ఎప్పుడు చూడనటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాలో మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే 2 నిమిషాల 45 సెకండ్ల పాటు సాగిన ఈ ట్రైలర్ ఎక్కడ బోర్ కొట్టించకుండా చాలా ఎక్సైటింగ్ గా సాగడం విశేషం…
ఈ సినిమాలో ఉన్న ప్రతి పాయింట్ ని పాయింట్ అవుట్ చేస్తూ దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ఇక ట్రైలర్ కనక చూసినట్లైతే పక్కాగా కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ కొట్టబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇక మేకింగ్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దర్శకుడు చాలా బాగా చూపించాడు…
ఇక ‘తేలు నిప్పుల్లో పడి చనిపోతున్నప్పుడు దాన్ని కాపాడాలనుకుంటే అది దాని స్వభావాన్ని చూపిస్తుంది’.  అనే డైలాగ్ లోనే సినిమా కథ మొత్తాన్ని చెప్పేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే 1980స్ బ్యాక్ డ్రాప్ ను బాగా రీ క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఎప్పుడు రొటీన్ సినిమాలు చేస్తాడనే అపవాదులు మోస్తున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో అందరి విమర్శలకు చెక్ పెట్టబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది…
https://youtu.be/n75xEs-9u1I?si=8TEutYujhJonEKAL