IND Vs NZ 2nd Test Match : తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులకు న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ కాగా.. రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. స్పిన్ వికెట్ పై భారత బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. రవీంద్ర జడేజా 38, గిల్ 30, యశస్వి జైస్వాల్ 30 మాత్రమే ఆకట్టుకున్నారు. సాంట్నర్ 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఫిలిప్స్ 2 క్రికెట్లు సాధించాడు. సౌతి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో టీమిండియా 156 పరుగులకే కుప్పకూలింది. అయితే న్యూజిలాండ్ – భారత్ తొలి ఇన్నింగ్స్ లలో స్పిన్ బౌలర్లు ఏకంగా 19 వికెట్లు పడగొట్టడం విశేషం. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో భారత స్పిన్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు.. ఇక భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బౌలర్ సాంట్నర్ 7 , ఫిలిప్స్ 2, సౌతి 1 వికెట్లు దక్కించుకున్నారు.
55 సంవత్సరాల తర్వాత..
పూణే టెస్టులో దాదాపు 19 వికెట్లను స్పిన్ బౌలర్లు తీయడంతో అరుదైన చరిత్ర ఆవిష్కృతమైంది. 55 సంవత్సరాల తర్వాత భారత్ వేదికగా ఒక టెస్ట్ లో తొలి రెండు ఇన్నింగ్స్ లలో స్పిన్ బౌలర్లు 19 వికెట్లు సాధించడం ఇదే తొలిసారి. 1969లో భారత్, న్యూజిలాండ్ జట్లు నాగ్ పూర్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలి రెండు ఇన్నింగ్స్ లలో స్పిన్ బౌలర్లు 19 వికెట్లు సాధించారు.. ఇక మొత్తంగా భారత గడ్డపై తొలి రెండు ఇన్నింగ్స్ లలో స్పిన్ బౌలర్లు అత్యధికంగా వికెట్లను సాధించడం ఇది మూడవసారి. కాన్పూర్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు 1952లో తలపడగా… రెండు ఇన్నింగ్స్ లలో స్పిన్ బౌలర్లు 20 వికెట్లు సాధించారు.. బెంగళూరు మైదానాన్ని పేస్ వికెట్ కు సహకరించే విధంగా రూపొందించడంతో.. భారత జట్టుకు ఊహించని ఫలితం వచ్చింది. దీంతో పూణే మైదానాన్ని స్పిన్ బౌలర్లకు అనుకూలించే విధంగా రూపొందించారు. దీంతో రెండు జట్లకు చెందిన స్పిన్ బౌలర్లు రెచ్చిపోతున్నారు.. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, సాంట్నర్ తమ కెరియర్ లోనే అద్భుతమైన గణాంకాలను నమోదు చేశారు. కాగా, సాంట్నర్ ధాటికి టీమిండియా ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. మెలికలు తిరిగిన బంతులు వేయడంతో ప్రతిఘటించలేకపోయారు. విరాట్ కోహ్లీ నుంచి మొదలు పెడితే ఆకాశ్ దీప్ వరకు చేతులెత్తేశారు. స్పిన్ వికెట్ పై రెచ్చిపోయే భారత బ్యాటర్లు గల్లి స్థాయిలో పాట తీరును ప్రదర్శించారు ఫలితంగా భారత్ 156 పరుగులకే కుప్ప కూలింది.