https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది..ఆ రెండు సన్నివేశాలకు థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' చిత్రం కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. 'రంగస్థలం', 'వినయ విధేయ రామ' తర్వాత రామ్ చరణ్ నుండి విడుదల అవ్వబోతున్న సోలో చిత్రమిది.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 3:50 pm
    The first review of 'Game Changer' is out..theaters will be blasted for those two scenes!

    The first review of 'Game Changer' is out..theaters will be blasted for those two scenes!

    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. ‘రంగస్థలం’, ‘వినయ విధేయ రామ’ తర్వాత రామ్ చరణ్ నుండి విడుదల అవ్వబోతున్న సోలో చిత్రమిది. అందుకే అభిమానులు ఈ చిత్రం పై కోటి ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు తమ హీరో ని ఎలా చూడాలని అనుకుంటున్నారో, అలా చూపించడమే కాకుండా, శంకర్ మార్క్ వింటేజ్ కమర్షియల్ యాంగిల్ కూడా ఈ టీజర్ లో కనిపించింది. ‘ఇండియన్ 2’ తర్వాత శంకర్ రేంజ్ పడిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రం తో ఆయన ఇచ్చే కం బ్యాక్ కి ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వుద్దని అంటున్నారు మేకర్స్.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రషస్ ని నిర్మాత దిల్ రాజు కొంతమంది బయ్యర్స్ కి చూపించాడట. వాళ్ళు ఈ రషస్ ని చూసి ఆశ్చర్యపోయాయారట. ఇటీవల కాలం లో ఈ రేంజ్ లో ఔట్పుట్ ని ఏ సినిమాలో చూడలేదని, యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ సన్నివేశాలు కూడా అదిరిపోయాయని, ఆడియన్స్ నుండి కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తే ఈ చిత్రం ప్రతీ సెంటర్ నుండి ఆల్ టైం రికార్డు నెలకొల్పుతుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దిల్ రాజు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట బయ్యర్స్. వచ్చే నెలలో విడుదల చేయబోయే థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తే ఆడియన్స్ మెంటలెక్కిపోతారని, ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయిలను రాబట్టేంత సత్తా ఉందని అంటున్నారు.

    ఇదంతా పక్కన పెడితే రీసెంట్ ఈ సినిమాలో విలన్ రోల్ చేసిన ఎస్ జె సూర్య ఒక ట్వీట్ వేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ ఇప్పుడే ‘గేమ్ చేంజర్’ చిత్రంలో రెండు సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేశాను. ఒక సన్నివేశం రామ్ చరణ్ తో, మరో సన్నివేశం శ్రీకాంత్ తో. కేవలం ఈ రెండు సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేయడానికి నాకు రెండు రోజుల సమయం పట్టింది. ఔట్పుట్ ఎలా వచ్చిందో మాటల్లో చెప్పలేను. జనవరి 10 వ తేదీన ‘పోతారు..మొత్తం పోతారు’. గేమ్ చేంజర్ చిత్రం ప్రభంజనం సృష్టించబోతోంది. ఈ మాట ని గుర్తు పెట్టుకోండి’ అంటూ చాలా బలమైన నమ్మకంతో చెప్పుకొచ్చాడు ఎస్ జె సూర్య. ఆయన మాటలను చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మరి సినిమా నిజంగా ఆ రేంజ్ లో ఉందా లేదా అనేది చూడాలి.